Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క్రమంలో కూడా పసిడి ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. ఇటీవల కాలంలో నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా బంగారం ధరలు

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price
Follow us

|

Updated on: Jun 08, 2021 | 6:54 AM

Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క్రమంలో కూడా పసిడి ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. ఇటీవల కాలంలో నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. రెండు నెలల క్రితం 40వేల చేరువలో ఉన్న బంగారం ధరలు.. ప్రస్తుతం 47 వేల మార్క్ దాటాయి. తాజాగా బంగారం ధరలపై రూ.800లు తగ్గింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.47,510 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 48,510 గా ఉంది. కాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.840 మేర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 47,950 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాములపై 1040 పెరిగి.. ధర 52,300 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,510 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,510 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,800 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,970 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,240 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,970 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,970 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Banks Privatization: మరో సంచలనం దిశగా కేంద్రం అడుగులు!.. ఎస్‌బిఐని కూడా ప్రైవేటీకరించబోతున్నారా?..