Google fined: గూగుల్‌కు భారీ షాక్.. రూ.1,951 కోట్ల ఫైన్​.. ఎవరు వేశారో తెలుసా..

GOOGLE: ప్రముఖ సెర్చ్​​ ఇంజిన్ 'గూగుల్​'కు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ-కాంపిటిషన్ వాచ్​డాగ్​​ సంస్థ భారీ జరిమానా విధించింది. ఆన్​లైన్​ అడ్వర్టైజింగ్ వ్యాపారంలో..

Google fined: గూగుల్‌కు భారీ షాక్.. రూ.1,951 కోట్ల ఫైన్​.. ఎవరు వేశారో తెలుసా..
Google
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 08, 2021 | 12:29 AM

ప్రముఖ సెర్చ్ ఇంజిన్​ గూగుల్​కు భారీ ఫైన్ పడింది. అంతా ఇంత కాదు ఏకంగా 268 మిలియన్​ డాలర్లు.  గూగుల్​కు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ కాంపిటిషన్​ వాచ్​ డాగ్​ సంస్థ 268 మిలియన్​ డాలర్ల జరిమానా విధించింది. ఆన్​లైన్​ ​ప్రకటనల విషయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.

ఆన్​లైన్​ అడ్వర్టైజింగ్ వ్యాపారంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు 268 మిలియన్​ డాలర్‌ జరిమానా విధించాలని తెలిపింది. కొన్ని మొబైల్​ సైట్లు, యాప్​లలో గూగుల్​ తమ పోటీదారుల ప్రకటనలకు సంబంధించి ఆంక్షలు విధించిందని సదరు వాచ్​డాగ్​ సంస్థ తెలిపింది. ఆధిపత్య స్థితిలో ఉన్న ఒక సంస్థ ఒక నిర్దిష్ట బాధ్యతకు లోబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి: Income Tax E-filing Portal: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లాంచ్.. ఇక చెల్లింపులు చాలా ఈజీ

 Tv9 Effect: డబ్బు జబ్బు పట్టిన ఆస్పత్రులకు చెక్ పెట్టిన టీవీ 9.. తెలంగాణ సర్కార్ కొరడాతో దారిలోకి..

JioSaavnTV: జియో నుంచి సరికొత్త వీడియో ప్లాట్ ఫామ్.. ప్రత్యేకమైన వీడియో ఫీచర్‌ విడుదల