Income Tax E-filing Portal: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లాంచ్.. ఇక చెల్లింపులు చాలా ఈజీ

ఆదాయపు పన్ను శాఖ.. పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చేసింది.  సరికొత్త ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను..

Income Tax E-filing Portal: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లాంచ్.. ఇక చెల్లింపులు చాలా ఈజీ
E Filing New Portal
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 07, 2021 | 10:10 PM

New Income Tax e-filing website launched: ఆదాయపు పన్ను శాఖ.. పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చేసింది.  సరికొత్త ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త పోర్టల్ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి  తీసుకొచ్చింది.

మరింత సరళంగా ఉండేలా కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax. gov.in)  ప్రారంభించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్‌లు త్వరితంగా జారీఅయ్యేందుకు ఐటీ రిటర్న్‌లను తక్షణమే ప్రాసెస్‌చేసేవిధంగా కొత్త పోర్టల్‌ అనుసంధానమై ఉంటుందని, తదుపరి మొబైల్‌యాప్‌ను కూడా విడుదల చేసినట్లుగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది.

పన్నుదారులకు సౌకర్యవంతమైన వెబ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా పోర్టల్ రూపొందించారు. ఈ-ఫైలింగ్ 2.0 పోర్టల్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ, అధికారికంగా సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. రిటర్న్స్ దాఖలును మొబైల్ ఫోన్‌లోనే చేసుకునే విధంగా ఈ-ఫైలింగ్ పోర్టల్ రూపొందించారు.

ఇప్పటి వరకు ఉన్న పాత వెబ్‌సైట్ స్థానంలో కొత్తగా (www.incometax. gov.in) వెబ్ సైట్ అందుబాటులోకొచ్చింది. ముందుగా పూర్తి చేసిన ఐటీ ఫారమ్స్ ఈ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. రిటర్న్స్‌ను ఎలా దాఖలు చేయాలనే అంశాలపై వీడియోలు వంటి సమాచారం పొందవచ్చు. కొత్త పోర్టల్ కార్యకలాపాలు జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభమైనట్టు ఆదాయ పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించడంతో పాటు, ఆదాయపు పన్ను శాఖ ఐటిఆర్ -1, ఐటిఆర్ -2, 4 ఫారమ్‌ల కోసం ఉచితంగా ఐటిఆర్ తయారీ సాఫ్ట్‌వేర్‌ను కూడా అందిస్తోంది. కొత్త ఐటిఆర్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ లింక్ www.incometax.gov.in లో కొత్త ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ఒకే డాష్‌బోర్డ్ మీద అన్ని రకాల అప్‌లోడ్స్, పెండింగ్స్ తెలుసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ ఇతర మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పన్నుచెల్లింపుదారులు క్షణాల్లో అకౌంట్లను చెక్ చేసుకోవచ్చు. పన్నుచెల్లింపుదారులకు హెల్ప్ డెస్క్ సౌకర్యం కూడా ఉంది.

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఇఫైలింగ్ పోర్టల్ 2.0 ద్వారా పన్ను చెల్లింపుదారులకు పలు రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. ఏ ఏ కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో చూద్దాం..

✒ కొత్త పోర్టల్ ద్వారా వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. అలాగే రిఫండ్ కూడా వేగంగానే వస్తుంది.

✒ కొత్త ఈ-ఫైలింగ్ సైట్ ఆవిష్కరణ తర్వాత మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి వస్తుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పలు రకాల సర్వీసులు పొందొచ్చు.

✒ సరికొత్త డ్యాష్‌బోర్డు కనిపిస్తుంది. అన్ని రకాల ఇంటరాక్షన్లు మీకు డిస్‌ప్లై అవుతాయి. అప్‌లోడ్స్, పెండింగ్ ట్రాన్సాక్షన్లు వంటివి కూడా కనిపిస్తాయి.

✒ ఆఫ్‌లైన్‌లోనే కూడా ఐటీఆర్ దాఖలు చేసే ఛాన్స్ ఉంటుంది.

✒ అలాగే పన్ను చెల్లింపుదారుల సందేహాలు తీర్చుకోవచ్చు.

✒ ట్యాక్స్ పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్ ఎలా దాఖలు చేయాలో నేర్చుకోవచ్చు.

✒ ట్యుటోరియల్, చాట్ బాట్, లైవ్ ఏజెంట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. మీరు మీ సందేహాలను తీర్చుుకోవచ్చు.

✒ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి పలు రకాల పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. సులభంగానే చెల్లింపులు నిర్వహించొచ్చు.

ఇవి కూడా చదవండి : Tv9 Effect: డబ్బు జబ్బు పట్టిన ఆస్పత్రులకు చెక్ పెట్టిన టీవీ 9.. తెలంగాణ సర్కార్ కొరడాతో దారిలోకి..

JioSaavnTV: జియో నుంచి సరికొత్త వీడియో ప్లాట్ ఫామ్.. ప్రత్యేకమైన వీడియో ఫీచర్‌ విడుదల

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో