AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangos: డయాబెటిస్ రోగులు, గర్భిణీలు మామిడి పళ్లు తినోచ్చా ? డాక్టర్స్ దీని గురించి చెప్పిన అసలు నిజాలు..

మామిడి పండ్లు.. పండ్లకు రారాజు అంటుంటారు. కేవలం ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Mangos: డయాబెటిస్ రోగులు, గర్భిణీలు మామిడి పళ్లు తినోచ్చా ? డాక్టర్స్ దీని గురించి చెప్పిన అసలు నిజాలు..
Mango
Rajitha Chanti
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 07, 2021 | 4:38 PM

Share

మామిడి పండ్లు.. పండ్లకు రారాజు అంటుంటారు. కేవలం ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి పండ్లలో అనేక రకాల పోషకాలున్నాయి. ఎక్కువ మంది మామిడి పండును జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే చాలా బరువు పెరుగుతామనే అపోహాతో మామిడి పండ్లను తినరు. నిజాంగానే మామిడి పండు తింటే బరువు పెరుగుతారా ? లేదా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండులో సోడియం, కొలెస్ట్రాల్ ఏమి ఉండవు. అందుకే ఇది తింటే బరువు పెరగరు. ఇందులో విటమిన్ ఎ, సీ, బీ 6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఉన్నాయి. అంతేకాదు.. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఈ పండును సంతోషంగా తినవచ్చు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. అంతేకాకుండా.. శరీరం నుంచి రాడికల్స్ ను కూడా తొలగిస్తుంది. చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది.

మామిడి పండులో 55 కంటే తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగినది. డయాబెటిస్ రోగులకు ఇది మంచిది. అందుకే వీరు రోజుకు ఒక మామిడి పండు తినవచ్చు. ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలా మంది గర్భిణీ స్త్రీలు మామిడి పండును తినరు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. కానీ గర్భిణీలు మామిడి పండును తినవచ్చని డాక్టర్స్ సూచిస్తున్నారు. కాకపోతే మితంగా తినాలి. మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం.

1. మామిడి పండులో విటమిన్లు ఎ, బి, సి ఉన్నాయి. అదనంగా మామిడి పండు బరువు తగ్గడానికి చాలా అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది.

2. ఇందులో చక్కెర ఉన్నందున శరీరానికి శక్తిని ఇస్తుంది. ఎండలో అలసిపోయినట్లు అనిపిస్తే మామిడి ఉత్సాహాన్ని ఇస్తుంది. వేసవిలో మామిడి పండు జ్యూస్ తాగడం ఉత్తమం.

3. మామిడిలోని పదార్థాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మామిడి పండు ముఖంలోని ముడతలను తగ్గించడంతో పాటు సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది.

4. వైద్యుల అభిప్రాయం ప్రకారం సాధారణ పరిమాణపు మామిడి వెన్న లేదా బాదం కంటే పోషకమైనది. మామిడి శరీరంలోని నరాలు, కణజాలాలు, కండరాలను బలపరుస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Also Read: మీ మొబైల్ నుంచే ఇన్‏కమ్ టాక్స్ ఫైలింగ్.. అందుబాటులోకి కొత్త పోర్టల్ తీసుకువచ్చిన కేంద్రం..