World Food Safety Day 2021: ఆహారం పాడవకుండా ఈ చిట్కాలు పాటించండి.. అనారోగ్యాన్ని దూరంగా ఉంచండి!
World Food Safety Day 2021: ప్రతి సంవత్సరం జూన్ 7 న ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికోసం ప్రత్యేకమైన థీం రూపొందిస్తారు. ఈ సంవత్సరం థీమ్ 'ఆరోగ్యకరమైన రేపటి కోసం సురక్షితమైన ఆహారం నేడు'.
World Food Safety Day 2021: ప్రతి సంవత్సరం జూన్ 7 న ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికోసం ప్రత్యేకమైన థీం రూపొందిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ‘ఆరోగ్యకరమైన రేపటి కోసం సురక్షితమైన ఆహారం నేడు’. ఈ రోజును ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, ఆహార వ్యవసాయ సంస్థ 2018 డిసెంబర్‌లో ప్రకటించాయి. ఆహార భద్రత, చెడిపోయిన ఆహారం వల్ల కలిగే వ్యాధుల గురించి ప్రపంచమంతా తెలుసుకునేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆహారాన్ని ఎలా చెడిపోకుండా చూసుకోవాలి? మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ఆహారం కలుషితం కాకుండా ఎలా చూసుకోవాలి అనే అంశాలు తెలుసుకుందాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) ప్రకారం చెడిపోయిన ఆహారం, వైరస్లు, పరాన్నజీవులు, రసాయన పదార్ధాలలో అసురక్షిత్మవుతుంది. ఇందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరుతుంది. ఇది అతిసారం (విరేచనాలు), క్యాన్సర్ నుండి 200 కంటే ఎక్కువ వ్యాధులకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు చెడిపోయిన ఆహారాన్ని తినడం ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల 20 వేల మంది ప్రజలు పాడైన ఆహరం తినడం ద్వారా సంక్రమిస్తున్న వ్యాధితో మరణిస్తున్నారు.
ఆహారాన్ని చెడిపోకుండా ఇలా చేయాలి..
World Food Safety Day 2021: వేసవి కాలంలో ఉదయం ఉడికించే ఆహారం మధ్యాహ్నం లేదా సాయంత్రం అయ్యేసరికి చెడిపోతుంది. అవి పాలు కానీయండి, కూరగాయలు కానీయండి ఏ ఆహారపదార్ధమైనా వేసవి కాలంలో సాయంత్రానికి పాడైపోతుంది. వేసవి కాలం అనే కాదు చాలా సందర్భాల్లో ఆహారాన్ని జాగ్రత్తగా పెట్టుకోకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. ఆహారం పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..
- అన్నం వండిన తరువాత, అది మిగిలిపోతే చింతించకండి. మిగిలిన అన్నాన్ని గాలిదూరని బాక్స్ లో పెట్టి మూత పెట్టండి. ఇప్పుడు ఈ బాక్స్ ను ఫ్రిజ్‌లో ఉంచి, సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం హాయిగా తినవచ్చు.
- ఏదైనా ఆహరం వండిన కొద్దిసేపటి తరువాత అంటే నాలుగైదు గంటల తరువాత తీసుకుంటే కనుక తప్పనిసరిగా వేడి చేసి తీసుకోవాలి
- వేసవిలో, పాలు విరిగిపోవడం వంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ మీరు ఈ సమస్య ఉంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పాలను బాగా మరిగించాలి. తరువాత గది ఉష్ణోగ్రతకు పాలు వచ్చేవరకూ చల్లార్చాలి. ఆ తరువాత ఫ్రిజ్‌లో ఉంచండి. ఒకవేళ ఫ్రిజ్ లేకపోతే, అప్పుడు ఒక పెద్ద పాత్రలో సాధారణ నీటిని నింపి, దాని మధ్యలో పాలు నిండిన గిన్నెను ఉంచండి.
- బీన్స్ లేదా ఇతర పొడి కూరగాయలను వంట చేసేటప్పుడు, అందులో కొద్దిగా కొబ్బరిని కలపండి. కొబ్బరికాయను జోడించడం ద్వారా, కూరగాయలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటాయి. కొబ్బరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి.
- వంట తయారుచేసిన వెంటనే ఏదైనా ఆహార పదార్థాన్ని ఫ్రిజ్‌లో ఉంచవద్దు. మొదట గది ఉష్ణోగ్రత వరకూ చల్లబరచండి, తరువాత ఫ్రిజ్‌లో ఉంచండి.
- మీరు ఆఫీసుకు ఆహారాన్ని తీసుకువెళుతుంటే కనక, అది చల్లబడిన తర్వాత మాత్రమే టిఫిన్ బాక్స్ లో సర్దుకొంది. కార్యాలయానికి వచ్చిన తర్వాత బ్యాగ్ నుండి ఆహారాన్ని బయటకు తీసి పెట్టుకోండి.
- ముడి కూరగాయలు, పండ్లను మొదట బాగా కడగాలి. తరువాత వాటిని ఫ్రిజ్‌లో ఉంచండి. పండ్లు లేదా కూరగాయలను చిన్న పరిమాణంలో కొనడానికి ప్రయత్నించండి. అందువల్ల రెండు మూడు రోజుల్లోనే వాటిని మీరు వినియోగించే వీలు కలుగుతుంది.
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి పుట్టిందే కోవిద్-19 వైరస్……పూణే శాస్త్రజ్ఞుల జంట ధ్రువీకరణ