PM Modi Speech: : 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచిత వాక్సిన్.. మొత్తం బాధ్యత కేంద్రానిదే.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని నరేంద్రమోదీ..

PM Modi Speech : ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్ధేశించి ప్రసంగిస్తున్నారు. అందులో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు.

PM Modi Speech:  : 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచిత వాక్సిన్.. మొత్తం బాధ్యత కేంద్రానిదే.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని నరేంద్రమోదీ..
Pm Narendra Modi
Follow us
uppula Raju

|

Updated on: Jun 07, 2021 | 6:03 PM

PM Modi Speech: : ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్ధేశించి ప్రసంగిస్తున్నారు. అందులో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం జూన్ 21 (ప్రపంచ యోగా దినోత్సవం) నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా పేదలకు అందించే ఉచిత రేషన్ సరుకుల పంపిణీని దీపావళి వరకు పొడగించారు. ఇప్పటి వరకు దేశంలో దేశంలో 23 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్లను అందించామని ప్రధాని స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడానని.. టీకా కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. సెకండ్‌ వేవ్‌ కంటే ముందే ఫ్రంట్‌లైన్‌ యోధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్టు మోదీ తన ప్రసంగంలో తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా టీకాలను సరఫరా చేస్తామని, ప్రైవేట్ వాక్సినేషన్ కూడా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా త‌క్కువ‌ని, మ‌నం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోక‌పోతే విదేశాల నుంచి రావ‌డానికి ఏళ్లు ప‌ట్టేదన్నారు. దేశంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని, ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉప‌యోగించి ఆక్సిజ‌న్ కొర‌త తీర్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

టీకా తయారీ సంస్థలు, క్లినికల్‌ ట్రయల్స్‌కు పూర్తి మద్దతుగా నిలిచామన్నారు. కేంద్రం తీసుకున్న కచ్చితమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్లు వచ్చాయని, దేశంలో 7 కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయని తెలిపారు. మరో మూడు కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయని, చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వివరించారు. నాసల్‌ స్పే టీకా కోసం కూడా ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనం ఎవరి కంటే వెనుకబడలేదని గుర్తు చేశారు. కొద్ది రోజుల్లోనే కొవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Twitter: ట్విట్టర్ ప్రభుత్వం చెబుతున్న నిబంధనల పై ఎందుకు పట్టుదలకు పోతోంది? అసలు విషయం ఏమిటి?

కేసులు తగ్గుతున్నా….కోవిద్ రోగుల మరణాలతో బెంగుళూరు విలవిల……ప్రభుత్వ ఆందోళన…..

First Solar Eclipse of 2021 : జూన్ 10న మొదటి సూర్యగ్రహణం..! ఆ రోజున పొరపాటున కూడా ఇవి చేయవద్దు..