నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు.. ప్రాథమిక నివేదికలో తేలిన లైంగిక వేధింపుల ఆరోపణలు
Dr.Prabhakar suspend: నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెంటెండ్ ప్రభాకర్‌పై కొరడా జులిపించింది రాష్ట్ర సర్కార్. వైద్య విద్యార్ధినిని లైంగికంగా వేధించినట్లు ప్రభాకర్‌పై ఆరోపణలు రావడంతో రెండు రోజుల క్రితం...
నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెంటెండ్ ప్రభాకర్‌పై కొరడా జులిపించింది రాష్ట్ర సర్కార్. వైద్య విద్యార్ధినిని లైంగికంగా వేధించినట్లు ప్రభాకర్‌పై ఆరోపణలు రావడంతో రెండు రోజుల క్రితం ప్రభాకర్‌ను ఉన్నతాధికారులు కర్నూలు బదిలీ చేశారు. అయితే.. ప్రాథమిక నివేదికలో ఆరోపణలు నిజమని తేలడంతో సూపరింటెండెంట్ ప్రభాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జొన్న ప్రభాకర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా హౌస్ సర్జన్ ఆరోపించడం సంచలనం రేపింది. వట్టి ఆరోపణలు చేయడం కాకుండా.. దానికి ఆధారంగా ఆమె విడుదల చేసిన ఆడియో మరింత కలకలం సృష్టించింది.
తనపై జరుగుతున్న వేధింపులను ఫోన్‌లో సూపరింటెండెంట్ ప్రభాకర్‌ను నిలదీసిన సంభాషణ ఆ ఆడియోలో రికార్డు అయింది. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ కావడంతో ప్రభాకర్‌పై మహిళా సంఘాలు వ్యక్తం చేశాయి. నెల్లూరు GGHలో వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.