సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు.. త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తాం – ఎమ్మెల్యే కాకాణి
Anandaiah Medicine Distribution: గొలగమూడిలో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించారు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి. ముందుగా గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలోని కళ్యాణమండపంలో...
గొలగమూడిలో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించారు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి. ముందుగా గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలోని కళ్యాణమండపంలో సర్వేపల్లిలో మందు పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని 1లక్షా 80 వేల కుటుంబాలకు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని చేస్తున్నట్లుగా వెల్లడించారు ఎమ్మెల్యే కాకాణి. నియోజకవర్గంలోని రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని అన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు.
ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ, కంపెనీకి అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ప్రప్రథమంగా మందు అందించడానికి సహకరించిన ఆనందయ్యకు ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆనందయ్య ఆయుర్వేద మందు విషయంలో ముందు నుంచి తాను ఆనందయ్యకు అండగా నిలివడంతో వ్యక్తిగతంగా నాకు మంచిపేరు వస్తుందని కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డడారు.
ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని… సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పి.. ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని కాకాణి చెప్పుకొచ్చారు. కోవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ మందు వాడాలని.. కోవిడ్ నివారణ కోసం నీలం రంగు ప్యాకెట్ మందు వాడాలని సూచించారు.
ప్రజలకు మేలుచేసే ఉద్దేశంతోనే ఆనందయ్యకు మద్దతు ఇచ్చామన్నారు. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు… త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తామన్నారు. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తామని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు. ప్రతిఒక్క ఇంటికీ ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.