AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ ట్రక్కులో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ తరలింపు….ఇంగ్లండ్ పోలీసులూ ! మీకివే మా ‘జోహార్లు’ అంటున్న ‘ట్రోలర్లు’ !

చూడబోతే ఇంగ్లండ్ పోలీసుల తెలివికి 'జోహార్లు ' అర్పించాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఇందుకు కారణం ఈ నెల 4 న హెర్ ఫోర్డ్ పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న ఓ చిన్న (మినీ) ఈ-స్కూటర్ ని ఓ భారీ ట్రక్కుపై..

భారీ ట్రక్కులో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ తరలింపు....ఇంగ్లండ్ పోలీసులూ  ! మీకివే మా 'జోహార్లు' అంటున్న 'ట్రోలర్లు' !
Great Use Of Tax Payers Many Police Trolled
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 07, 2021 | 4:13 PM

Share

చూడబోతే ఇంగ్లండ్ పోలీసుల తెలివికి ‘జోహార్లు ‘ అర్పించాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఇందుకు కారణం ఈ నెల 4 న హెర్ ఫోర్డ్ పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న ఓ చిన్న (మినీ) ఈ-స్కూటర్ ని ఓ భారీ ట్రక్కుపై తరలించడమే.. కేవలం 15 కిలోల బరువు మాత్రమే ఉన్న ఈ వాహనాన్ని వారు 7.5 టన్నుల రికవరీ ట్రక్కులో తరలించడం చర్చనీయాంశమైంది. పోలీసులు తమ డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసి ట్రోల్ చేయని వాళ్ళు లేరు. సోషల్ మీడియాలో ఒక్కో యూజరూ ఒక్కో విధంగా స్పందిస్తూ.. ఈ సైజున్న 20-30 స్కూటర్లు సులభంగా పట్టే ఈ భారీ ట్రక్కు మీద ఇంత చిన్ని వాహనాన్ని తీసుకుపోతున్నారా అని ఒకరంటే…పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేయడానికే ఇలా చేస్తున్నారని మరొకరు విమర్శించారు. ఇది మీ శాఖ డబ్బును వేస్ట్ చేయడం గాక మరేమీ కాదని ఇంకొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రైవేటు కంపెనీ ఇలా చేస్తే ఇందుకు బాధ్యులైనవారిని డిస్మిస్ చేసేవారని కొందరు వ్యాఖ్యానించారు. ఆ మినీ వాహనాన్ని మడిచి కారులో పెట్టండి అని కొంతమంది విసుక్కున్నారు.

అయితే పోలీసులు ఈ ఫోటోను హైలైట్ చేస్తూ..అనుమతించదగని చోట్ల ఇలాంటి వాహనాలను నడిపితే ఇందుకు బాధ్యులైనవారిని ప్రాసిక్యూట్ చేస్తామని, ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా 300 పౌండ్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఏమైనా అతి చిన్న వాహనాన్ని భారీ ట్రక్కులో తరలించడాన్ని మాత్రం ప్రజలు ‘జీర్ణించుకోలేకపోతున్నారు’.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆరు బయట నవారు మంచం మీద పిల్లలతో అలా బన్నీ హాయి ని అనుభవిస్తున్న అల్లు అర్జున్ : Allu Arjun Video viral.

ఆకు అంచున అద్భుతమైన పక్షిగూడు..నేచర్ టాలెంట్ కి ఫిదా అవుతున్న నెటిజెన్లు :Bird nest inside leaf viral video.

Shocking Video: తప్పిన పెను ప్రమాదం.. అతనే గనుక అలర్ట్‌గా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో..వైరల్ అవుతున్న వీడియో.

డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో పేస్ బుక్ ఖాతాపై రెండేళ్ల నిషేధం.2023 వరకు సస్పెండ్ – face book.:Facebook suspends Trump Video.