China Experiments: మహిళా సైంటిస్ట్ ఆధ్వర్యంలో కోతులు..కుందేళ్ళ పై చైనా జన్యుమార్పిడి పరిశోధనలు.. అక్కడే పుట్టిన కరోనా..!

China Experiments:  చైనా పేరు చెబితేనే అబద్ధానికి మారుపేరు అనాలనిపిస్తుంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతోంది. ప్రపంచ మానవాళికి ముప్పు తీసుకువచ్చే విపరీత పోకడలకు పోతోంది.

China Experiments: మహిళా సైంటిస్ట్ ఆధ్వర్యంలో కోతులు..కుందేళ్ళ పై చైనా జన్యుమార్పిడి పరిశోధనలు.. అక్కడే పుట్టిన కరోనా..!
China experiments
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 07, 2021 | 9:23 PM

China Experiments:  చైనా పేరు చెబితేనే అబద్ధానికి మారుపేరు అనాలనిపిస్తుంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతోంది. ప్రపంచ మానవాళికి ముప్పు తీసుకువచ్చే విపరీత పోకడలకు పోతోంది. బయటకు మాట్లాడేది ఒకటి.. అంతర్గతంగా చేసేది ఇంకోటి. కరోనా మహమ్మారిని మన మీదకు తీసుకువచ్చింది చైనా అని అన్ని దేశాలూ వేలెత్తి చూపించడమే కాదు.. చాలావరకూ దానికి సంబంధించిన ఆనవాళ్ళూ ఇటీవల కాలంలో బయటపడ్డాయి. ఇప్పుడు మరో దారుణమైన విషయం చైనాకు సంబంధించి బయటపడింది. అది జన్యు ఇంజనీరింగ్ సహాయంతో జంతువుల జన్యువులు మార్చే ప్రయోగాలు వేగంగా చైనా చేస్తోంది అనే విషయం. ఇది చాలా అనర్ధదాయకం అని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. చైనా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలోని వుహాన్ నగరంలోని ఒక ప్రయోగశాలలో జన్యు ఇంజనీరింగ్ సహాయంతో 1,000 కంటే ఎక్కువ జంతువుల జన్యువులు మార్చేశారు. ఈ జంతువులలో కోతులు, కుందేళ్ళు కూడా ఉన్నాయి. కరోనావైరస్ వుహాన్ నుండే ప్రపంచమంతటా వ్యాపించింది. దీర్ఘకాల చైనా జర్నలిస్ట్ జాస్పర్ బేకర్, చైనా మీడియాలో ప్రచురించిన అనేక కథనాలను ఉటంకిస్తూ ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికను స్థానిక వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. చైనాలోని ఒక ప్రయోగశాలలో జంతువులకు వైరస్ సోకినట్లు ఈ నివేదిక చెబుతోంది. తద్వారా వాటి జన్యువులు మారుతాయి. వాటికి చేసిన ఇంజెక్షన్‌లో ఉపయోగించిన పదార్థం వల్లనే కరోనా వైరస్ పుట్టిందని శాస్త్రవేత్తలు భయపడ్డారు. ఇతర దేశాలలో నిషేధించబడిన ఇటువంటి ప్రయోగాలు చైనా తన ప్రయోగశాలలలో చేస్తోందని చెబుతున్నారు. అదీకాకుండా మానవులపై కూడా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. అనేక దేశాలలో ఇటువంటి ప్రయోగాలు అనైతికంగా పరిగణించబడతాయి.

లైవ్ యానిమల్స్‌పై..

చైనా వూహాన్ లేదా ఇతర ప్రదేశాలలో ప్రయోగశాలలు జీవ భద్రతపై పరిశోధన కోసం నిర్మించబడిందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాయి. కానీ అక్కడ వాస్తవానికి విరుద్ధంగా నేరుగా జంతువులపై ప్రత్యక్ష ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో, వారి భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం లేదు. పరీక్షా గొట్టంలో ఉంచిన వ్యాధికారక జీవులను వాటిలోకి చొప్పించిన తరువాత కోతులు పారిపోతాయి, కొరుకుతాయి ఎన్నో విపరీత చేష్టలు చేస్తాయి. చైనా విద్యావేత్తలు వుహాన్ ల్యాబ్ గురించి అనేక వ్యాసాలు రాశారు. వాటిలో ఒకటి ‘కరోనా యొక్క సాధ్యమైన మూలం’. వుహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనారోగ్య జంతువులను తన ప్రయోగశాలలో ఉంచినట్లు పేర్కొంటున్నాయి ఆ వ్యాసాలూ. వాటిలో సుమారు 605 గబ్బిలాలు ఉన్నాయి. ఈ గబ్బిలాలు పరిశోధకులపై కూడా దాడి చేశాయి.

కరోనా వైరస్ సృష్టించింది మహిళా సైంటిస్ట్..

కొంతమంది చైనా నిపుణులు వుహాన్ వైరాలజిస్ట్ షి జెంగ్లీ మారుమూల గుహలను సందర్శించారని చెప్పారు. ఆమె ఇక్కడ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తోంది. చైనాలో జెంగ్లీని ‘బాట్ వుమన్’ అని పిలుస్తారు. జెంగ్లీ ప్రయోగశాలలో కరోనావైరస్ను సృష్టించే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు.. జెంగ్లీ అనేక ఎలుకలలోకి వైరస్ను ఇంజెక్ట్ చేశారని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చైనా చాలా ప్రమాదకరమైన ఈ ప్రయోగశాలలను పర్యవేక్షిస్తోంది. సైన్యం రెండు విషయాలను పర్యవేక్షిస్తోంది. మొదటిది – మెరుగైన సైనికులను తయారు చేయడానికి జన్యువులో మార్పులు తీసుకురావడం. రెండవది – అటువంటి సూక్ష్మ జీవుల యొక్క ఆవిష్కరణ. వీటితో కొత్త జన్యు ఆయుధాలను తయారు చేయడానికి జన్యువులను మార్చవచ్చు. దాని ద్వారా ప్రపంచాధిపత్యానికి బాటలు వేసుకోవాలని చైనా భావిస్తోందని ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Also Read: World Food Safety Day 2021: ఆహారం పాడవకుండా ఈ చిట్కాలు పాటించండి.. అనారోగ్యాన్ని దూరంగా ఉంచండి!

భారీ ట్రక్కులో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ తరలింపు….ఇంగ్లండ్ పోలీసులూ ! మీకివే మా ‘జోహార్లు’ అంటున్న ‘ట్రోలర్లు’ !