AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Cases: ఆంధ్రాలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా వ్యాప్తి.. కొత్త‌గా 4,872 పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాలు ఇలా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. కొత్తగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 64,800 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా...

AP Corona Cases:  ఆంధ్రాలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా వ్యాప్తి.. కొత్త‌గా  4,872 పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాలు ఇలా
Andhra Pradesh Corona Updates
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2021 | 5:26 PM

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. కొత్తగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 64,800 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా 4,872 కరోనా కేసులు వెలుగుచూశాయి. కొత్త‌గా మ‌రో 86 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 13,702 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,14,510 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో కొత్త‌గా కరోనాతో చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 మంది మృతి చెందారు. శ్రీకాకుళంలో 9; విజయనగరం, పశ్చిమ గోదావ‌రి జిల్లాలో ఏడుగురు చొప్పున ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 961 కేసులు వెలుగుచూశాయి. తూ.గో. జిల్లాలో 810, అనంతపురం జిల్లాలో 535, ప్రకాశం జిల్లాలో 447 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.

చిన్నారుల కోసం 3 చోట్ల కేర్‌ సెంటర్లు: జగన్‌

చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ-గుంటూరు ఒకచోట వాటిని రెడీ చేయాలని సూచించారు. కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. క‌రోనా థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్‌ సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్‌, డేటాలను అధికారులు ఆయనకు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఒక్కో కేర్‌ సెంటర్ నిర్మాణానికి రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. థర్డ్‌వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని.. పోషకాహార పంపిణీ, వ్యాక్సినేష‌న్ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు.

Also Read: ఆంధ్ర‌ప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాల‌లోకి ప్ర‌వేశించిన నైరుతి రుతుపవనాలు

 రేపు ‘మృగశిర కార్తె’.. ఈ కార్తెకు పేరు ఎలా వచ్చింది…? దీని ప్రాముఖ్యత ఏమిటి..?

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌