ఆంధ్ర‌ప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాల‌లోకి ప్ర‌వేశించిన నైరుతి రుతుపవనాలు

సోమ‌వారం(07.06.2021) నైరుతి రుతుపవనాలు అలీఘడ్, పూణే, మెదక్, నల్గొండ, ఆంధ్రప్రదేశ్ లోని రెంటచింతల, శ్రీహరికోట.....

ఆంధ్ర‌ప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాల‌లోకి ప్ర‌వేశించిన నైరుతి రుతుపవనాలు
Ap Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2021 | 5:01 PM

సోమ‌వారం(07.06.2021) నైరుతి రుతుపవనాలు అలీఘడ్, పూణే, మెదక్, నల్గొండ, ఆంధ్రప్రదేశ్ లోని రెంటచింతల, శ్రీహరికోట, పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రా ప్రాంతాలలోనికి ప్రవేశించాయ‌ని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారుగా తేదీ 11.06.2021 న ఉత్తర బంగాళాఖాతము, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్ల‌డించింది. దీని ప్రభావం వలన రాగల 2 రోజులలో నైరుతి రుతుపవనాలు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రాంతాలు, బీహార్ లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : —————————— ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ———————- ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.

Also Read: గులాబీ గూటికి ఎల్.రమణ..! జోరుగా ప్ర‌చారం.. స్పందించిన ఆయ‌న ఏమ‌న్నారంటే

సీఎం కేసీఆర్ స్పెష‌ల్ ఆర్డ‌ర్స్.. న‌కిలీ విత్త‌నాలు అమ్మే కేటుగాళ్ల తాట తీస్తున్న పోలీసులు