AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోన్ తీసుకున్న వ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోతే ఆ డబ్బును వారసులు కట్టాల్సిందేనా ? నియమాలు ఏంటంటే..

బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు కొన్ని సందర్భాల్లో డబ్బులు అత్యవసరం అయినప్పుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఆ లోన్ తీసుకున్న

లోన్ తీసుకున్న వ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోతే ఆ డబ్బును వారసులు కట్టాల్సిందేనా ? నియమాలు ఏంటంటే..
Loan Rules
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2021 | 2:59 PM

Share

బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు కొన్ని సందర్భాల్లో డబ్బులు అత్యవసరం అయినప్పుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఆకస్మాత్తుగా మరణిస్తే.. ఆ లోన్ అలాగే మిగిలిపోతుంది. అయితే ఆ మిగిలిన లోన్ ఎవరు కట్టాలి ? రుణ గ్రహీత వారసులు కట్టాలా ? లేక నామినీదారులు కట్టాలా ? అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతుంటాయి. అలాగే లోన్ నియమాలు ఎంటీ ? దానిని తిరిగి ఎలా చెల్లించాలో తెలుసుకుందాం.

నియమాలు… లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత లోన్ తిరిగి చెల్లించడానికి ప్రతి రుణానికి ఒక భిన్నమైన నియమం ఉంది. హోం లోన్ నియమాలు భిన్నంగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత లోన్ నియమాలు కూడా భిన్నంగా ఉంటాయి.

హోం లోన్ నియమాలు.. నిజానికి హోం లోన్ తీసుకున్నప్పుడల్లా.. ఇంటి పేపర్లు లోన్ కు బదులుగా తాకట్టు పెడతారు. హోం లోన్ విషయంలో రుణగ్రహీత చనిపోయినప్పుడు, సహ రుణ గ్రహీత బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి వారసుడికి రుణాన్ని చెల్లించే బాధ్యత ఉంటుంది. వారు లోన్ చెల్లించగలిగితే వారికి మాత్రమే బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా.. ఆస్తిని తాకట్టు పెట్టడానికి, లోన్ తీర్చడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇవేకాకుండా.. బ్యాంక్ రుణానికి వ్యతిరేకంగా ఉంచిన ఆస్తిని వేలం వేస్తారు. ఇలా చేయడం ద్వారా వచ్చిన మనీని బ్యాంకు లోన్ అప్పుగా తీసుకుంటుంది. వాస్తవానికి బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో బీమా ఉంటుంది. వ్యక్తి మరణిస్తే బీమా ద్వారా బ్యాంక్ దాన్ని తిరిగి పొందుతుంది. కాబట్టి లోన్ తీసుకున్నప్పుడల్లా బీమా గురించి బ్యాంకువారిని అడగాలి.

పర్సనల్ లోన్ నియమాలు…. పర్సనల్ లోన్ అంతగా మంచిది కాదు. అందుకే వ్యక్తిగత లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ విషయంలో మరణించిన తర్వాత బ్యాంకులు మరే వ్యక్తి నుంచి డబ్బును తిరిగి పొందలేరు. అలాగే వ్యక్తిగత రుణానికి సంబంధించి వారసుడికి ఎటువంటి బాధ్యత ఉండదు. అటువంటి పరిస్థితిలో వ్యక్తి మరణంతో లోన్ కూడా ముగుస్తుంది.

వాహన లోన్ నియమాలు.. వాహన లోన్ అనేది ఒక రకమైన సురక్షిత రుణం. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బ్యాంకు గృహస్థులను రుణం చెల్లించమని అడుగుతుంది. అతను రుణం చెల్లించకపోతే, బ్యాంకులు వాహనాన్ని విక్రయించి రుణ మొత్తాన్ని తిరిగి పొందుతాయి.

Also Read: Brain Boosting Food For Kids: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ ఆహారం తినిపించాలి.. నిపుణుల సూచనలు..