Godavari Floods: గోదావరి ప్రళయానికి ఏడాది.. సరిగ్గా ఈ రోజునే మహోగ్రరూపం దాల్చిన గోదారమ్మ..
Kaleshwaram Floods: జూలై లో మహా ప్రళయానికి ఏజెన్సీ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది..ఎపుడు ఏమి జరుగుతుందో అనే భయం వెంటాడింది..జూలై 17 న సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చారు...ముంపు ప్రాంతాలను పరిశీలించి..బాధితులను పరామర్శించారు.. శాశ్వత పరిష్కారానికి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించారు..
గోదావరి మహోగ్ర రూపం దాల్చి.. భద్రాచలం ఏజెన్సీ ని ముంచెత్తింది.. గోదావరి ప్రళయానికి సరిగ్గా ఏడాది అవుతుంది..గత సంవత్సరం జులై 16 న రికార్డు స్థాయిలో గోదావరి నీటిమట్టం 70.3 అడుగులకు చేరుకుంది.. భద్రాచలం కు నలువైపులా వరద చేరి ద్వీపకల్పంలా మారింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పినపాక, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల,కరకగూడెం మండలాల్లో దాదాపు వంద గ్రామాలు మునిగి పోయాయి..30 వేల మందికి పైగా నిర్వాసితులయ్యారు.. ప్రాణ నష్టం జరగక పోయినా భారీగా ఆస్తి నష్టం జరిగింది..కట్టు బట్టలతో వేలాది మంది నిరాశ్రయు లయ్యారు..20 వేల ఎకరాల్లో భారీగా పంట నష్టం జరిగింది..
ఇప్పటివరకు ఏడు సార్లు 60 అడుగులు దాటింది..33 సంవత్సరాలు తరవాత ఊహించని విధంగా అతి పెద్ద ప్రళయం వచ్చింది..పెద్ద ఎత్తున అధికారులు,పోలీసులు,రెవిన్యూ వివిధ శాఖల సిబ్బంది నిరంతరం..వరద సహాయక చర్యలు చేపట్టింది.. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆర్మీ రంగంలోకి దిగి..వరద సహాయక చర్యల్లో పాల్గొంది..
భద్రాచలం చరిత్ర లోనే మూడవ అతిపెద్ద వరద వచ్చింది..
- 1976 నుంచి 2022 వరకు గోదావరి నీటి మట్టం 35 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక దాటింది..
- భద్రాచలం గోదావరి ఇప్పటివరకు 19 సార్లు మూడవ ప్రమాద హెచ్చరిక దాటింది..
- అత్యధికంగా 1986 లో 75.6 అడుగులు చేరింది.
- 1990 లో 70.8 అడుగులు
- 2022 లో 70.3 అడుగులు దాటింది
ఏజెన్సీ కి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి..ఎటూ వెళ్లలేని పరిస్థితి.. 144 సెక్షన్ పెట్టీ..భద్రాచలం గోదావరి బ్రిడ్జి పై నాలుగు రోజుల పాటు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. ఆర్మీ హెలికాప్టర్లు ద్వారా..చర్ల,దుమ్ముగూడెం మండలాల్లో నిర్వాసితులకు ఆహారం,పాలు,బిస్కెట్లు అందచేశారు..భద్రాద్రి రామాలయం చుట్టూ వరద చేరింది..మెట్ల వరకు వచ్చింది..ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం ,విస్తా కాంప్లెక్స్ మునిగింది..
జూలై లో మహా ప్రళయానికి ఏజెన్సీ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది..ఎపుడు ఏమి జరుగుతుందో అనే భయం వెంటాడింది..జూలై 17 న సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చారు…ముంపు ప్రాంతాలను పరిశీలించి..బాధితులను పరామర్శించారు.. శాశ్వత పరిష్కారానికి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించారు.. 2026 ఇళ్లు కట్టిస్తామని..కరకట్ట నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు..మళ్ళీ వరదలు వస్తె తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.. గోదావరి పరివాహక ప్రాంతం వాసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం