పొలానికి వెళ్లిన తల్లి ఎంతసేపైనా ఇంటికి తిరిగిరాలేదు.. ఖంగారుగా కొడుకు అక్కడికి చేరుకోగా.!
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామ శివారులో తన పొలంలో పనిచేసుకుంటున్న అదే గ్రామానికి చెందిన మెట్టు నర్సు(53) అనే మహిళను..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామ శివారులో తన పొలంలో పనిచేసుకుంటున్న అదే గ్రామానికి చెందిన మెట్టు నర్సు(53) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు మెడలో నుండి చైన్ లాక్కొని బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. ఉదయం గ్రామ శివారులో మెట్పల్లి రహదారిని అనుకొని ఉన్న తన పొలంలో పనిచేయడానికి వెళ్ళింది. సాయంత్రం తన తల్లిని తీసుకురావడానికి వెళ్ళిన కొడుకు.. పొలంలో ఆమె కనబడకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. చీకటి పడ్డా తల్లి రాకపోవడంతో తిరిగి పొలంలోకి వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉన్న తల్లిని చూసి బంధువులకు, గ్రామస్తులకు, పోలీసులు సమాచారం ఇచ్చాడు. మెట్పల్లి డి.ఎస్.పి రవీందర్ రెడ్డి సంఘటన స్థలానికి సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.