‘కూరగాయలు వద్దు.. నాన్ వెజే బెస్ట్’.. చికెన్, ఫిష్ కోసం పోటీపడుతోన్న జనం..
కూరగాయలు వద్దు.. నాన్ వెజే నయం అంటున్నారు వినియోగ దారులు. రోజు రోజుకి మండిపోతున్న కూరగాయల ధరలతో పోలిస్తే.. వాటి కంటే చికెన్, ఫిష్ బెటర్ అని చెబుతున్నారు.
కూరగాయలు వద్దు.. నాన్ వెజే నయం అంటున్నారు వినియోగ దారులు. రోజు రోజుకి మండిపోతున్న కూరగాయల ధరలతో పోలిస్తే.. వాటి కంటే చికెన్, ఫిష్ బెటర్ అని చెబుతున్నారు. కొద్దిరోజులుగా టమోటా కేజీ రూ 160 నుంచి 200 వరకు పలుకుతోంది పచ్చిమిర్చి కేజీ 160 పైగా 200 వరకు పలుకుతోంది. పెరుగుతున్నాయే తప్పా.. రేట్లు కిందికి దిగడం లేదు. దీనితో ఫిష్ కేజీ రూ 160, చికెన్ రూ. 220 ఉంటే కొన్ని చోట్ల రూ. 180కి కూడా అమ్ముతున్నారు. అందుకే నాన్ వెజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కూరగాయలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతిపై భారం పడుతుంది. ఆదివారం కావడంతో నాన్ వెజ్‌కి ప్రిపర్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చికెన్, ఫిష్‌తో పాటు టమోటా, పచ్చిమిర్చి రేట్లు పోటీ పడుతున్నాయి. కొనుగోళ్లు లేక కూరగాయల మార్కెట్లు వెలవెల బోతున్నాయి.
గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో కూరగాయలు పండించే రైతులు కరువయ్యారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు సరఫరా చేయటంతో ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు అధికం కావడంతో కూరగాయల ధరలు చుక్కలుంటుతున్నాయి. ప్రజలు కూడా కూరగాయల బదులు అదే రేట్లో చికెన్ రావటంతో చికెన్ కొనటానికి మొగ్గు చూపుతున్నారు. కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువులు, పప్పు దినుసులు ధరలు చాలా ఎక్కువ ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి టమోటా, పచ్చిమిర్చికి సబ్సిడీ రేటు ఇవ్వాలని.. పెరిగిన నిత్యావసర సరుకుల రేట్లను తగ్గించాలని కోరుతున్నారు.