Hyderabad: సీఎం రమేశ్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ యత్నం.. అడ్డుకున్న ఎంపీ అనుచరులు..

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నంబర్‌ 66లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫుట్‌పాత్‌ను ఆక్రమించారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు

Hyderabad: సీఎం రమేశ్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ యత్నం.. అడ్డుకున్న ఎంపీ అనుచరులు..
Cm Ramesh
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2022 | 6:48 PM

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నంబర్‌ 66లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫుట్‌పాత్‌ను ఆక్రమించారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే అంతలోనే ఎంపీ అనుచరులు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. వారి విధులకు ఆటంకం కలిగించారు. మరోవైపు ఆక్రమణల తొలగింపు కొనసాగుతుండగానే ఎంపీ సీఎం రమేష్‌ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కొంత భాగాన్ని కూల్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు సిబ్బంది, పోలీసులు సాయంతో మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.

కాగా ఓవైపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది, మరోవైపు ఎంపీ, ఆయన అనుచరులు, పోలీసులు ఒక్కసారిగా గుమిగూడడంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 66లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Also Read:

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో విస్తృత తనిఖీలు..

DJ Tillu: టిల్లు అన్న డీజే పెడితే ఇలాగే ఉంటది.. అదరగొడుతోన్న డీజే టిల్లు టైటిల్‌ సాంగ్‌..

Viral news: కొవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి ఆలుమగల మధ్య గొడవ.. పిల్లల్ని కిడ్నాప్‌ చేసిందని భార్యపై భర్త ఫిర్యాదు..