కులవృత్తిని కాపాడుకునేందుకే స్పెషల్ థీమ్.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న కమ్మరి గణనాధుడు..
వినాయక నవరాత్రులు వచ్చాయంటే చాలు.. గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాల హడావిడి అంతా ఇంతా కాదు. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలు తొమ్మిది రాత్రుళ్ళు పూజలు చేస్తారు. అయితే ప్రతి ఏడు వివిధ రకాల రూపాలతో గణనాథులు ఏర్పాటు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటారు నిర్వాహకులు.
వినాయక నవరాత్రులు వచ్చాయంటే చాలు.. గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాల హడావిడి అంతా ఇంతా కాదు. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలు తొమ్మిది రాత్రుళ్ళు పూజలు చేస్తారు. అయితే ప్రతి ఏడు వివిధ రకాల రూపాలతో గణనాథులు ఏర్పాటు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటారు నిర్వాహకులు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వినాయకచవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మండపాల్లో వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్యలను ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. నిత్య పూజలు, అన్నదానాలు, భజనలతో వినాయక మండపాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఇక పలు చోట్ల వివిధ ప్రత్యేక థీమ్ లతో ఏర్పాటు చేసిన గణనాధులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని కుమ్మరి(శాలివాహన) సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుండలను తయారు చేస్తున్నట్లు వినాయకుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు. అయితే మండపం నిర్వాహకులు కుమ్మరి సంగం నాయకులు కావడంతో వారి కుల వృత్తిని ఇతి వృత్తంగా ఈ ఏడు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఒక చేతిలో కుండ ఆకారంలోని పాత్ర, మరో చేతిలో కమ్మరి పరికరంతో గణపయ్య చేయి కదులుతూ ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే మట్టి పాత్రలు చేస్తున్న కమ్మరి గా వినాయకుడుని కొలువు దీర్చారు. విగ్రహానికి ఎదురుగ్గా కుమ్మరి చక్రం ఏర్పాటు చేశారు. కమ్మరి వృత్తిని కాపాడాలని ఓ ఫ్లెక్సిని సైతం మండపంలో పొందుపర్చారు. తమ కులవృత్తుల విధానం గ్రామాలలో కనుమరుగైందని గుర్తు చేసే విధంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక కాలంలో కమ్మరుల కుండలు కనుమరుగు అవుతున్నాయని మండపం నిర్వాహకులు చెబుతున్నారు. మట్టి పాత్రల్లో వంటలు, కుండలోని నీటిని తాగితేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని హితవు పలుకుతున్నారు. ఇప్పుడు స్టీల్ బిందెలు, ఫ్రిజ్జులు ఎలక్ట్రానిక్ పరికరాలతో తయారుచేసిన వాటి ద్వారా వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారని చెబుతున్నారు.
మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..