AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభం.. శుభం తెలియని ఆరేళ్ల చిన్నారి వదలని కామాంధుడు.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..!

మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష విధిస్తూ పొక్సో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆరేళ్ళ బాలిక పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన గఫార్ ఖాన్ అనే వలసకూలీకి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

అభం.. శుభం తెలియని ఆరేళ్ల చిన్నారి వదలని కామాంధుడు.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..!
Judgement
P Shivteja
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 12, 2024 | 8:22 PM

Share

అది హైదరాబాద్ మహానగర శివారు సంగారెడ్డిలోని పారిశ్రామిక ప్రాంతం. అక్కడ ఆరేళ్ల చిన్నారి డెడ్‌బాడీని పోలీసు ఇన్వెస్టిగేషన్‌కు సవాలు విసిరింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడో మృతదేహాన్ని అఘాయిత్యానికి పాల్పడి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారి మృతికి అసలు కారణాలేంటి? పోలీసు కోణంలో టార్చ్ వేసి చూస్తే నమ్మలేని భయాలు కనిపిస్తున్నాయి. చివరికి నిందితుడిని పట్టుకుని కోర్టు ముందు ఉంచారు పోలీసులు. ఎట్టకేలకు కఠిన శిక్ష విధించింది పాస్ట్ ట్రాక్ కోర్టు.

మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష విధిస్తూ పొక్సో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆరేళ్ళ బాలిక పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన గఫార్ ఖాన్ అనే వలసకూలీకి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధిత కుటుంబానికి రు. పది లక్షల పరిహారం ఇవ్వాలని గురువారం(సెప్టెంబర్ 11 ) ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తీర్పు చెప్పింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

బిడియల్ భానూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆరేళ్ళ బాలిక తాత, కుటుంబీకులు పనికి వెళ్లగా, ఆరేళ్ల బాలిక ఇంటి వద్దే ఉంది. బీహార్ కు చెందిన 56 ఏళ్ల వలస కూలీ గఫార్ ఖాన్ పక్క గదిలో ఉంటున్నాడు. గతేడాది అక్టోబర్ 16న గఫార్ ఖాన్ మద్యం సేవించి ఆరేళ్ల పాపకు కూల్ డ్రింక్ తాగించి తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు. అయితే మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకువెళ్ళి పాపపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబుతుందేమోనన్న ఉద్దేశంతో ఆమెను హత్య చేశాడు. కనిపించకుండా పోయిన చిన్నారి విగతజీవిగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబసభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

కేసు విచారణకు పొక్సో పాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన 11 నెలల వ్యవధిలోనే న్యాయస్థానం విచారణ పూర్తి చేసి గురువారం తీర్పు ఇచ్చింది. కేసు పూర్వపరాలు, ఆధారాలు పరిశీలించిన స్పెషల్ పోక్సో జడ్జి.. గఫార్ ఖాన్ ను దోషిగా తేల్చి చనిపోయోంత వరకు ఉరి తీయాలని తీర్పునిచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యులకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వవలసిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, హై కోర్ట్ నుంచి స్పీడ్ ట్రయల్ అనుమతి తీసుకున్నారు. కేవలం 11 నెలలలో నిందితుడికి ఉరి శిక్ష పడేలా చేశారు. నేరస్థుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ రూపేష్ అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..