AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గేదేలే అంటూ సిట్టింగ్‌ వేశారు..! ఆస్పత్రిని అడ్డాగా చేసుకున్న పేకాట క్వీన్స్ అరెస్ట్..

ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాల్గవ అంతస్తులో అడ్డగా ఏర్పాటు చేసుకున్న వీళ్లంతా ఎంచక్కా పేకాట ఆడుతున్నట్టుగా తెలిసింది. పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఒకటవ టౌన్ పోలీసులు పేకాట స్థావరం పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న మహిళలను

తగ్గేదేలే అంటూ సిట్టింగ్‌ వేశారు..! ఆస్పత్రిని అడ్డాగా చేసుకున్న పేకాట క్వీన్స్ అరెస్ట్..
Women Playing Poker Arreste
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2024 | 7:35 AM

Share

మగవాళ్లకు దీటుగా మహిళలు ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారు. మేమెందులో తక్కువ అన్నట్టుగా పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళా మణులు.. ఇప్పుడు పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పేకాట ఆడుతున్న నలుగురు ఆడవాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా, పోలీసులకు పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నిజామాబాద్ నగరంలోని సరస్వతీ నగర్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాల్గవ అంతస్తులో అడ్డగా ఏర్పాటు చేసుకున్న వీళ్లంతా ఎంచక్కా పేకాట ఆడుతున్నట్టుగా తెలిసింది. పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఒకటవ టౌన్ పోలీసులు పేకాట స్థావరం పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న మహిళలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు, రూ.15,100ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..