పిట్ట కొంచెం.. కూత ఘనం..! ఎనిమిదేళ్లకే అద్భుత ప్రతిభతో వరల్డ్ రికార్డ్‌లో స్థానం..

దేశంలోనే వేగంగా అతి తక్కువ సమయంలో రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్నప్పటి నుంచే అద్భుత జ్ఞాపక శక్తి కలిగి ఉన్న శ్రీరామ్‌.. గతంలో 19 సెకన్లతో రాష్ట్రాలు, రాజధానులు చెప్పిన రికార్డును అధిగమించాడు. చిన్నోడి ప్రతిభను చూసి అబ్బురపడుతున్నారు.

పిట్ట కొంచెం.. కూత ఘనం..! ఎనిమిదేళ్లకే అద్భుత ప్రతిభతో వరల్డ్ రికార్డ్‌లో స్థానం..
8 Year Old Boy Manu Sriram
Follow us
M Revan Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 25, 2024 | 12:08 PM

సాధారణంగా ఎవరైనా ఒక నాలుగైదు రాష్ట్రాల రాజధానుల పేర్లను సులభంగానే గుర్తు పెట్టుకుంటారు. మహా అయితే మనం నిత్యం వినియోగించే పది అంకెల ఫోన్ నెంబర్లను కూడా గుర్తుపెట్టుకుంటాం. ఓ 20 రాష్ట్రాల పేర్లు వాటి రాజధానులు గుర్తు పెట్టుకోవాలంటే కాస్త కష్టమే..! కానీ, ఎనిమిదేళ్ల బుడతడు మాత్రం అతి తక్కువ సమయంలో దేశంలోని రాష్ట్రాల రాజధానుల పేర్లను మాత్రం అవలీలగా చెప్పేస్తున్నాడు. ఈ బుడతడు పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా తన ప్రతిభతో వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ బుడతడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వైద్యుడు డాక్టర్‌ నవీన్‌కుమార్‌ -శ్వేత దంపతులు స్థానికంగా హాస్పిటల్‌‌ను నిర్వహిస్తున్నారు. వీరికి ఎనిమిదేళ్ళ కుమారుడు మను శ్రీరామ్‌ ఉన్నాడు. స్థానిక సంస్కృతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అద్భుత ప్రతిభ కనబరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ బుడతడు దేశంలోని రాష్ట్రాలు, రాజధానులను 15.8 సెకన్లలో చెప్పి ప్రపంచ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.

దేశంలోనే వేగంగా అతి తక్కువ సమయంలో రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్నప్పటి నుంచే అద్భుత జ్ఞాపక శక్తి కలిగి ఉన్న శ్రీరామ్‌.. గతంలో 19 సెకన్లతో రాష్ట్రాలు, రాజధానులు చెప్పిన రికార్డును అధిగమించాడు. చిన్నోడి ప్రతిభను చూసి అబ్బురపడుతున్నారు. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ప్రపంచ రికార్డు సాధించిన శ్రీరామ్‌ను పట్టణానికి చెందిన పలువురు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..