AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విధుల్లో ఉండగానే.. పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన మహిళ ఉద్యోగి..?

అయితే, ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఎక్స్‌ ద్వారా స్పందించారు. ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్‌లను సీరియస్‌గా తీసుకుంటున్నాయని, అది ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుందని ఆరోపించారు.. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధుల్లో ఉండగానే.. పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన మహిళ ఉద్యోగి..?
Woman Dies Work Pressure
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2024 | 11:30 AM

Share

యూపీలోని లక్నోలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాంకు ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సదాఫ్‌ ఫాతిమా రోజు మాదిరిగానే మంగళవారం ఆఫీసుకు వచ్చారు. విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలారు. తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే.. అడిషనల్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఫాతిమాకు ఈ మధ్యే ప్రమోషన్‌ వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని తన తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

అయితే, ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఎక్స్‌ ద్వారా స్పందించారు. ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్‌లను సీరియస్‌గా తీసుకుంటున్నాయని, అది ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుందని ఆరోపించారు.. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..