AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది.. స్పైడర్‌మ్యాన్‌ ఇలా బిచ్చమెత్తుకోవటం ఏంటో..! విడ్డూరం కాకపోతే..

వీడియోలో, స్పైడర్‌మ్యాన్ వేషం వేసుకున్న వ్యక్తి రైల్వే స్టేషన్‌లో నేలపై కూర్చొని భిక్షాటన చేస్తున్న ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పాదాల నుంచి తల వరకు స్పైడర్‌మ్యాన్ డ్రెస్‌నే వేసుకున్న ఒక వ్యక్తి గతంలోనూ ఎండలో టెర్రస్‌పై కూర్చొని, పొయ్యి మీద రొట్టెలు చేశాడు..రోజూ కూలీగా మారి ఇటుకలు కూడా మోశాడు.. ఇప్పుడు ఇలా..

ఇదేందయ్యా ఇది.. స్పైడర్‌మ్యాన్‌ ఇలా బిచ్చమెత్తుకోవటం ఏంటో..! విడ్డూరం కాకపోతే..
Spider Man
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2024 | 7:57 AM

Share

సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయేందుకు ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారు చాలా మంది. ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. రీల్స్ సరదాతో కొందరు చేసే పనులు.. ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. అలాగే, కొందరు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తుంటారు. అలాంటి ఒక విచిత్రమైన వేషధారణలో ఉన్న ఒక యువకుడు రైల్వే స్టేషన్‌ ముందు కూర్చుని భిక్షాటన చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన స్పైడర్‌ మ్యాన్‌ వేషంలో ఉన్న యువకుడు నేలపై కూర్చొని ప్రజల్ని సాయం కోరటం చూసిన నెటిజన్లు ఓమై గాడ్.. స్పైడర్ మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటని ఫన్నీగా స్పందించారు.

సోషల్ మీడియాలో ఫేమ్‌కోసం చాలా మంది విచిత్రమైన అవతారాలను అలవర్చుకుంటున్నారు. కొందరు వింత డ్యాన్స్, డైలాగులతో ప్రేక్షకుల ముందుకు వస్తే, మరికొందరు వింత అవతారాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమర్ల వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. గతంలో స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ యువకుడు టెర్రస్ పై కూర్చుని వంట చేయడం, ఓ వృద్ధుడిని రోడ్డు దాటేందుకు సహకరించడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదిగో స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్‌లో ఉన్న యువకుడు రైల్వే స్టేషన్ లో కూర్చుని అడుక్కుంటున్నాడు. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో కనిపించింది ఈ సీన్‌. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్, స్పైడర్ మ్యాన్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని చమత్కరించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

రీల్స్‌ చేసి ఫేమస్‌ కావడానికి ఎలాంటి వెర్రి సాహసమైన సరే చేసేవారూ ఉన్నారు. అదేవిధంగా రీల్ వీడియో కోసం స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న యువకుడు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (shaddyman98) పంచుకున్నాడు. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 2.9 మిలియన్ల వ్యూస్‌, అనేక కామెంట్లు వచ్చాయి. అయ్యో పాపం స్పైడర్ మ్యాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ ఫన్నీ కామెంట్ రాశారు. మరోకరు పాపం స్పైడర్ మ్యాన్‌కి ఇలాంటి పరిస్థితి వచ్చిందా..? అని వ్యాఖ్య రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?