విమానంలో పొగలు.. 280 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా..

280 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న విమానంలో పొగలు వ్యాపించాయి. విమానం రెక్కల నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులతో బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది.

విమానంలో పొగలు.. 280 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా..
Smoke From Flight Leads
Follow us

|

Updated on: Sep 25, 2024 | 7:22 AM

280 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న విమానంలో పొగలు వ్యాపించాయి. విమానం రెక్కల నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులతో బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ షాకింగ్‌ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి 9.50గంటల ప్రాంతంలో ప్రయాణికులు ఎక్కేముందు విమానంలో ఇంధనం నింపుతుండగా పొగలు కనిపించాయి. వెంటనే అలర్ట్‌ అయిన ఎయిర్‌ఫోర్ట్‌ ఫైర్‌ అండ్‌ రెస్క్యూ టీం హుటాహుటినా రంగంలోకి దిగి దానిని ఆర్పివేశారు.

ప్రమాద సమయంలో విమానాశ్రయంలోని టెర్మినల్‌, లాంజ్‌లో దాదాపు 320 మంది ప్రయాణికులు వేచి ఉన్నారు. టెక్నికల్‌ టీ వెంటనే విమానాన్ని పరిశీలించారు. 10 నిమిషాల్లో పొగ ఆగిపోయింది. అప్పటికే అగ్నిమాపక యంత్రాలు కూడా రంగంలోకి దిగాయని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెల్లడించారు. పొగలు రావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. దీంతో విమానం ఆలస్యంగా బయల్దేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..