Watch: దేవుడా నువ్వే దిక్కు.. సిద్ధివినాయక ప్రసాదంలో ఎలుకల సంసారం..! ఆలయ ట్రస్ట్‌ వివరణ..

ప్రసాదం బుట్టలో ఎలుకల వీడియోపై పూర్తి విచారణ జరుపుతామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు విచారణ జరిపి సరైన వివరణ ఇస్తారని ముంగంటివార్ పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటో, వీడియోపై కూడా దర్యాప్తు చేయనున్నారు.

Watch: దేవుడా నువ్వే దిక్కు.. సిద్ధివినాయక ప్రసాదంలో ఎలుకల సంసారం..! ఆలయ ట్రస్ట్‌ వివరణ..
Siddhivinayak Temple Prasad
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2024 | 12:07 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారు భక్తుల కొంగుబంగారం. శ్రీవారి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యి వివాదం ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న భక్తుల్లో ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. ఓ వైపు ప్రసాదం తయారీలో కల్తీపై చర్చలు కొనసాగుతున్న క్రమంలో ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక మందిరంలోని ప్రసాదం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సిద్ధివినాయకుని ఆలయంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సిద్ధివినాయకుని ఆలయంలో భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం బుట్టల్లో ఎలుకలు విహరిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సిద్ధివినాయక ఆలయంలోని ప్రసాదం బుట్టలో ఎలుకలు తిరుగుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలయ పరిసరాల పరిశుభ్రతపై భక్తుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని సిద్ధివినాయక ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ వీడియో ఆలయం వెలుపలిది కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో ఎప్పుడూ పరిశుభ్రత ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రసాదం బుట్టలో ఎలుకల వీడియోపై పూర్తి విచారణ జరుపుతామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు విచారణ జరిపి సరైన వివరణ ఇస్తారని ముంగంటివార్ పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటో, వీడియోపై కూడా దర్యాప్తు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

సిద్ధివినాయకుని ఆలయంలో ప్రతిరోజూ దాదాపు 50 వేల లడ్డూలను తయారు చేస్తారు. ఒక ప్రసాదం ప్యాకెట్‌లో ఒక్కొక్కటి 50 గ్రాముల రెండు లడ్డూలు ఉంటాయి. పండుగ సమయాల్లో ప్రసాదానికి డిమాండ్ పెరుగుతుంది. భక్తులకు ప్రసాదం పంపిణీ చేసే ముందు ఆహార, ఔషధాల శాఖ అధికారులు ఈ లడ్డూలలో వాడే పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ధృవీకరిస్తున్నారని నివేదిక పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?