AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ రామ.. ఉడుత దెబ్బకు రైలు రద్దు..! ప్రయాణికులకు తప్పని అవస్థలు..

ఆ రైలు సర్రీలోని రెడ్‌హిల్‌ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఉడుతలను బయటకు తరిమేందుకు ప్రయత్నించారు. కానీ, వాటి లో ఓ ఉడుత రైలు దిగకుండా మొండికేయడంతో గమ్యస్థానానికి చేరకముందే ఆ రైలు సర్వీసును రద్దు చేయాల్సి వచ్చినట్టు గ్రేట్‌ వెస్ట్రన్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. ఉడుతల వీరంగంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

రామ రామ.. ఉడుత దెబ్బకు రైలు రద్దు..! ప్రయాణికులకు తప్పని అవస్థలు..
Two Squirrel
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2024 | 9:22 AM

Share

మనదేశంలో రైలు రద్దయినప్పుడల్లా మనం రైల్వే డిపార్ట్‌మెంట్‌ని చాలా తిట్టుకుంటూ ఉంటాం. అయితే, భారతదేశంలో రైలు రద్దుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి భారీ వర్షాలు, వరదలు, ఇంజిన్ వైఫల్యం వంటివి. ఇది కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఇక్కడ రైలు రద్దుకు మరో కొత్త కారణం వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. రెండు ఉడతల కారణంగా అధికారులు రైలును రద్దు చేశారు. ఏంటీ షాక్‌ అవుతున్నారు కదా..! పూర్తి వివరాల్లోకి వెళితే…

బ్రిటన్‌లో ఈ ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రెండు ఉడతల కారణంగా ఇక్కడ రైలును మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. ఉడతలు కోచ్‌లో విపరీతమైన భీభత్సం సృష్టించడంతో అధికారులు నానా అవస్థలు పడ్డారు. శనివారం ఉదయం దక్షిణ ఇంగ్లండ్‌లోని రీడింగ్‌ నుంచి గాట్విక్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ రైలు గోమ్‌షాల్‌ వద్దకు చేరుకోగానే ఓ బోగీలోకి రెండు ఉడుతలు ప్రవేశించాయి. దీంతో ఆ బోగీలోని ప్రయాణికులు హడలెత్తిపోయారు.. కంగారు పడుతూ మరో బోగీలోకి పరుగులు తీశారు. ఆ రైలు సర్రీలోని రెడ్‌హిల్‌ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఉడుతలను బయటకు తరిమేందుకు ప్రయత్నించారు. కానీ, వాటి లో ఓ ఉడుత రైలు దిగకుండా మొండికేయడంతో గమ్యస్థానానికి చేరకముందే ఆ రైలు సర్వీసును రద్దు చేయాల్సి వచ్చినట్టు గ్రేట్‌ వెస్ట్రన్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. ఉడుతల వీరంగంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఈ సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ప్రజల నుండి ఫన్నీ కామెంట్స్ వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, బ్రిటన్ ఉడుతలు రాజులు, చక్రవర్తుల వలె మొండి పట్టుదలగలవి. ఆ రెండు ఉడతలు రైలును తమ రాజభవనంగా భావించినట్టుగా ఉన్నాయంటూ మరొకరు రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..