AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో కొట్టుకువచ్చిన పడవ.. ఏంటని దగ్గరకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయే షాక్‌..!

తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో ఒక గుర్తు తెలియన పడవ కనిపించింది. సముద్రంలో అనుమానాస్పదంగా కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏముందని దగ్గరికెళ్లి చూసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది.

సముద్రంలో కొట్టుకువచ్చిన పడవ.. ఏంటని దగ్గరకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయే షాక్‌..!
Migrant Boat
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2024 | 8:01 AM

Share

పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం సంఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని డాకర్‌ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో ఒక గుర్తు తెలియన పడవ కనిపించింది. సముద్రంలో అనుమానాస్పదంగా కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏముందని దగ్గరికెళ్లి చూసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. ఆ పడవలో కుప్పలు తెప్పలుగా మనుషుల మృతదేహాలు కనిపించాయి. సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏకంగా 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. శరీరాలన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

ముందు నౌకాదళానికి ఈ పడవ గురించి కొందరు గుర్తు తెలియని వారు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఓ పెట్రోలింగ్‌ బోటును పంపగా..ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొనడంతోపాటు మృతుల సంఖ్యను నిర్ధరించే దిశగా విచారణను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల ప్రారంభంలోనూ సెనెగల్‌ తీరంలో ఓ వలసదారుల పడవ నీట మునిగి సుమారు 37మంది మృతి చెందారు. ఘర్షణలు, పేదరికం, ఉద్యోగాల కొరత వంటి కారణాలతో పశ్చిమ ఆఫ్రికా నుంచి అనేక మంది వలసదారులు సెనెగల్‌ ద్వారా విదేశాలకు అక్రమంగా వలస పోతుంటారు. చాలా మంది సమీపంలోని స్పెయిన్‌ కు చెందిన కానరీ దీవులకు వెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్