Maharashtra: అమరావతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు

మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Maharashtra: అమరావతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు
Road Accident In Maharashtr
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 23, 2024 | 12:52 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి జిల్లాలోని పరట్వాడ ధరణి రహదారిపై సెమడోహ్ సమీపంలో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి 30 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించరని సమాచారం. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, మహారాష్ట్రలోని అమరావతిలో బస్సు లోయలో పడిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో BSF సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్‌ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్‌ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..