AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. నిద్రలేవగానే.. హాయ్ అంటూ ఎదురొచ్చిన సింహం..! పై ప్రాణాలు పైకే..

ఈ వీడియో ఎక్కడిది, అందులో కనిపిస్తున్న వ్యక్తి పర్యాటకుడా.. లేక ఇది అతని ఇల్లేనా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, ఇందులో మూసి ఉన్న కిటికీ దగ్గర సింహం ఇంట్లోని వ్యక్తిని చూస్తూ కనిపించింది. వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో విస్తృతంగా షేర్ అవుతోంది. 

వామ్మో.. నిద్రలేవగానే..  హాయ్ అంటూ ఎదురొచ్చిన సింహం..! పై ప్రాణాలు పైకే..
man wakes up to lion staring at him
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2024 | 11:42 AM

Share

మనం ఉదయం నిద్ర లేవగానే మన పెంపుడు కుక్క లేదా పిల్లి మనల్ని ప్రేమగా చూస్తుంటే ఆ అనుభవం ఎంత గొప్పగా అనిపిస్తుంది కదా. కానీ, మనం కళ్లు తెరిచిన వెంటనే సింహం మనవైపు చూస్తూ ఉంటే.. అప్పుడ ఎలా ఉంటుందో ఊహించుకోగలరా..? కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో అలాంటిదే జరిగింది. ఓ ఇంట్లోని వారు నిద్రలేచిన వెంటనే ఎదురుగా భయంకర సింహం నిలబడి ఉండటం చూస్తున్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అడవి లోపల ఉండే అనుభవం. అనేక జూలలో జంతువులను దగ్గరగా చూడగలిగే వసతి సౌకర్యాలను కూడా అందిస్తాయి. ఈ ప్రదేశాలలో బయటి దృశ్యం స్పష్టంగా కనిపించే విధంగా ప్రజలు ఉండటానికి బలమైన గాజు క్యాబిన్‌లు, లేదంటే ఐరన్‌ నెట్స్‌తో బలంగా ఏర్పాటు చేసిన గదులను తయారు చేస్తారు. ఇక్కడ్నుంచి అడవి జంతువులను చాలా దగ్గరగా చూడటం వాటి ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఎక్కడిది, అందులో కనిపిస్తున్న వ్యక్తి పర్యాటకుడా.. లేక ఇది అతని ఇల్లేనా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, ఇందులో మూసి ఉన్న కిటికీ దగ్గర సింహం ఇంట్లోని వ్యక్తిని చూస్తూ కనిపించింది. వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో అతి వేగంగా వైరల్ అయింది. ఇంతకుముందు ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఇప్పుడు అది మళ్లీ రెడ్డిట్‌లో షేర్ చేయబడింది. వీడియోపై కామెంట్స్‌లో, చాలా మంది ప్రజలు అడవి జంతువులు ఎప్పుడూ ప్రమాదకరమే అంటున్నారు.  వామ్మో.. మీ ధైర్యానికి హాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా వీడియో మాత్రం నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..