Watch: వార్నీ ఏం కిలాడీ బిచ్చగాడు..! అడుక్కోవటంలో ఆరితేరిపోయాడు..!! ఈ వీడియో చూస్తే నోరెళ్ల బెడతారు..

ఓ పర్యాటక ప్రదేశానికి సమీపంలో ఓ వ్యక్తి రెండు చేతులు ఉన్నప్పటికీ వికలాంగుడిగా నటిస్తూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు చేతులను చొక్కా లోపల దాచుకుని, చేతులు లేనట్లు నటిస్తూ భిక్షాటన చేస్తున్నాడు. అతని ముందున్న డబ్బాలో ఎవరైనా డబ్బులు వేయగానే.. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, తీసుకుని చొక్కా జేబులో వేసుకుంటున్నాడు. ఈ వీడియో..

Watch: వార్నీ ఏం కిలాడీ బిచ్చగాడు..! అడుక్కోవటంలో ఆరితేరిపోయాడు..!! ఈ వీడియో చూస్తే నోరెళ్ల బెడతారు..
Kanyakumari A Beggar
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2024 | 7:22 AM

పర్యాటక ప్రదేశాలు, దేవాలయాల బయట, సిగ్నల్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, ఫుట్ పాత్ లు ఇలా చాలా ప్రాంతాల్లో భిక్షగాళ్లని చూస్తుంటాం. వారేదో కాళ్లు చేతులు సరిగా లేక, చేసేందుకు పని దొరక్క, తిండి లేక..పొట్టకూటి కోసం అడుక్కుంటున్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వారిలో కొందరు ధనవంతులు కూడా ఉంటారు. అలాగే కొందరు కాళ్లు, చేతులు అన్ని సక్రమంగా ఉండి కూడా చేతిలో ప్లేట్‌తో తనకు చేతులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, తినడానికి డబ్బు ఇవ్వండి అమ్మా అంటూ అడుక్కుంటున్నారు. ఇక అడుక్కునే శక్తి ఉండి కూడా పని పట్ల ఉదాసీనత ప్రదర్శించే వారు మరికొందరు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక బిచ్చగాడు కూడా జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడో చూస్తే కంగుతినాల్సిందే.! బిచ్చగాడి బాగోతం రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని కన్యాకుమారిలోని ఓ పర్యాటక ప్రదేశానికి సమీపంలో ఓ వ్యక్తి రెండు చేతులు ఉన్నప్పటికీ వికలాంగుడిగా నటిస్తూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు చేతులను చొక్కా లోపల దాచుకుని, చేతులు లేనట్లు నటిస్తూ భిక్షాటన చేస్తున్నాడు. అతని ముందున్న డబ్బాలో ఎవరైనా డబ్బులు వేయగానే.. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, తీసుకుని చొక్కా జేబులో వేసుకుంటున్నాడు. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ బెగ్గర్ యాక్టింగ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

అబ్దుల్ సలామ్ (ca_abdul_salam) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు. సెప్టెంబరు 11న షేర్ చేయబడిన ఈ వీడియో 1.8 మిలియన్లకు పైగా వ్యూస్‌, అనేక కామెంట్లతో నెట్టింట దూసుకుపోతోంది. ఒక నెటిజన్‌ స్పందిస్తూ…వాటే యాక్టింగ్ అని కామెంట్ రాశారు. ఇంకో యూజర్..ఎందుకు ఇంత చెత్త వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. మీరిలా వీడియో తీసి అతని పొట్టకూటిమీద దెబ్బ కొడుతున్నారంటూ మరో నెటిజన్‌ వ్యాఖ్యనించారు. మొత్తానికి వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే