దేశంలో అత్యంత అందమైన ఆరు రైలు ప్రయాణాలివే..! రైల్వే మంత్రి మాటల్లోనే..

రైలు ప్రయాణం అనగానే మనకు ముందుగా వచ్చే ఆలోచన రైల్వే స్టేషన్. ఇక రైల్లో ప్రయాణించే వారికి ఇష్టమైన కాలక్షేపం మ్యాగజైన్‌లు, ఆయా ప్రాంతాల వారిగా లభించే ఆహార పదార్థాలను కొని తినడం.. అన్నింటికంటే ముఖ్యంగా విండో సీటు పొందడం. ఇలాంటి అందమైన, మధురమైన స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. కానీ, రైలు ప్రయాణం మరింత అందంగా మార్చే ప్రదేశాలు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి. రైల్లో ప్రయాణిస్తుండగా చూసిన అక్కడి దృశ్యాలు మీ హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో కొన్నింటి జాబితాను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda

|

Updated on: Sep 24, 2024 | 10:45 AM

ఆరు అద్భుతమైన, అందమైన ప్రయాణాల జాబితాను పేర్కొన్న ఆయన.. మొదటి స్థానంలో గుజరాత్‌లోని కచ్‌లో తెల్లటి ఇసుక ఎడారి మీదుగా సాగే రైలు ప్రయాణానికి చోటు కల్పించారు. గుజరాత్ నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రయాణీకులకు కచ్ రాన్ తెల్లని ఉప్పు ఎడారిలో ప్రయాణించే అద్భుత అనుభవాన్ని కలిగిస్తుంది.

1 / 6
తర్వాత యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నీలగిరి మౌంటైన్‌ రైల్వేగా పేర్కొన్నారు. ఇది తమిళనాడులోని మెట్టుపాళయం నుండి ఊటీ వరకు విస్తరించి ఉంది. నీలగిరి మౌంటైన్ రైల్వే 46 కి.మీ పొడవైన సింగిల్ రైల్వే ట్రాక్. 1908లో నిర్మించబడిన ఈ రైలు నీలగిరి పర్వత శ్రేణిలో దాదాపు 16 సొరంగాలు మరియు 250 వంతెనల గుండా వెళుతుంది. ఈ రైలు 46 కిలోమీటర్ల ప్రయాణంలో 208 మలుపులతో దట్టమైన అడవులు, సొరంగాల గుండా ప్రకృతి రమణీయ దృశ్యాన్ని చూడవచ్చు.

2 / 6
జమ్ము కశ్మీర్‌లో బనిహాల్‌ నుంచి బద్‌గాం వరకు జరిగే ప్రయాణం మాటల్లో చెప్పలేని అద్భుతం. ఈ మార్గంలో వెళ్లేవారికి మంచు కురుస్తుండగా రైలులో ప్రయాణిస్తూ మీ టూర్‌ను మెమరబుల్‌గా మార్చుకోవచ్చు. బారాముల్లా-బానిహాల్ రూట్‌లో మంచు కురుస్తూ ఉంటుంది. ఈ రూట్‌లో ప్రయాణిస్తూ, మంచు కురవడాన్ని రైలు నుంచే చూడొచ్చు. ఓవైపు రైలుపై మంచు కురుస్తూ ఉంటే, మీరు ఆ రైలులో ప్రయాణిస్తుంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది.

3 / 6
గోవా దూద్‌సాగర్‌ జలపాతం మీదుగా వెళ్లే రైలు ప్రయాణం భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. దూద్‌సాగర్ జలపాతం1017 అడుగుల నుంచి జాలువారుతూ ఉంటే… దాని పక్క నుంచే రైలు వెళ్తుంది. ఆ సమయంలో జలపాతం నుంచి నీటి బిందువులు గాల్లో ఎగురుతూ మనల్ని టచ్ చేస్తాయి. ఆ చల్లదనం, ఆ నీటి స్పర్శ ఒకరకమైన ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ రైలు కాసేపు ఆగుతుంది కూడా.

4 / 6
కేరళలోని కప్పిల్‌లో కొబ్బరి తోటల నుంచి సాగే రైలు ప్రయాణం..ఎర్నాకులం - కొల్లం - త్రివేండ్రం వరకు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ రైల్వే మార్గం మీ జీవితంలో అత్యుత్తమ రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు ప్రసిద్ధ బ్యాక్ వాటర్స్ గుండా వెళుతుంది. ఇక్కడి అందాలు మిమ్మల్ని మళ్లీ మళ్లి  కేరళకు వచ్చేలా చేస్తాయి.

5 / 6
హిమాచల్‌ప్రదేశ్‌లో హిమాలయన్ క్వీన్ కల్క నుంచి సిమ్లా వరకు ఉన్న టాయ్‌ ట్రెయిన్‌ గురించి ఆయన పోస్ట్‌ చేశారు. ఈ మార్గంలో నడుస్తున్న రైళ్లు మీ బాల్యాన్ని మేల్కొలిపే టాయ్ రైళ్ల లాంటివి. 96 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం 1903లో ప్రారంభమైంది. ఇది 102 సొరంగాలు, 82 వంతెనల గుండా వెళుతుంది. 96 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ రైలుకు స్థానం దక్కింది.

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?