సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. ఎర్లీ విండో పేరుతో అగ్రిమెంట్ కంటే ముందుగానే ఓటిటికి ఇస్తున్నారు నిర్మాతలు. దాంతో ఆడియన్స్ వాటిని థియేటర్లలో చూడాలనుకున్నా.. వద్దులే రెండు వారాలకే ఇంటికి వచ్చేస్తుందని ఆగిపోతున్నారు. ఈ మధ్య మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్.. అప్పట్లో ఆచార్య, రాధే శ్యామ్ లాంటి సినిమాలు ఇలా వచ్చినవే.