- Telugu News Photo Gallery Cinema photos Actress Pratibha Ranta Reacts On Laapataa Ladies Movie For Oscars 2025
Laapataa Ladies- Pratibha Ranta: మా ఆశలు నిజమయ్యాయి.. కష్టానికి ఫలితం దక్కింది.. ‘లపతా లేడీస్’ హీరోయిన్..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ మూవీ 2025 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి అధికారికంగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ టీంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ మూవీలో కీలకపాత్ర పోషించిన నటి ప్రతిభారత్న ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో ఆమె పుష్పా రాణిగా మెప్పించారు.
Updated on: Sep 24, 2024 | 11:23 AM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ మూవీ 2025 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి అధికారికంగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ టీంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఈ మూవీలో కీలకపాత్ర పోషించిన నటి ప్రతిభారత్న ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో ఆమె పుష్పా రాణిగా మెప్పించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పెంచుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపింది.

ఎంతో ఆనందంగా ఉంది.. మాటలు రావడం లేదు. మేము ఈ సినిమా ఆస్కార్ కు మన దేశం నుంచి ఎంపిక కావాలని ఎంతో కోరుకున్నాం. మా ఆశలు నిజమయ్యాయి. కిరణ్ రావు, అమీర్ ఖాన్ లను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.

మా కష్టానికి ఫలితం దక్కింది.. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తూ పోతే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతం నా విషయంలోనూ అదే జరుగుతుంది. నేను ఊహించని దానికంటే ఎక్కువ ఆనందాన్ని చూడగల్గుతున్నాను అని అన్నారు.

ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ కోసం ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్ రావు ఆనందం వ్యక్తం చేసింది. అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన తన టీం, వారి హార్డ్ వర్క్ కు గుర్తింపు ఇది అన్నారు.




