Betel Leaves: తమలపాకులు తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే మీరు తినడం స్టార్ట్ చేస్తారు

తమలపాకులు అనగానే ఆధ్మాత్మిక భావన కలుగుతుంది. భారతదేశ సంస్కృతిలో తమలపాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. శుభకార్యం వచ్చిందంటే.. తప్పకుండా తమలపాకులు ఉండాల్సిందే. తమలపాకులను దేవుడికి సమర్పించడం మంచిదని, ఇతరులకు అందించినా శుభం జరుగుతుందని మన భారతీయులు భావిస్తారు. భారతదేశంలో తమలపాకుల వాడకం వందల ఏళ్ల నాటిది. పురాతన కాలంనుంచి ఆయుర్వేద ఔషధాల్లో తమలపాకుల పాత్ర ఉంది. తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 25, 2024 | 8:48 AM

తమలపాకును విందు భోజనాల తరువాత తాంబూలంలో వాడతారు అనుకుంటే పొరబాటే. తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో కార్డియోవాస్కులర్ , యాంటీ-డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ- అల్సర్, హెపాటో-ప్రొటెక్టివ్ , యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి వివిధ లక్షణాలు ఉన్నాయి.

1 / 5
ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి.  ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే  ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది. తమలపాకులో తగిన మొత్తంలో అవసరమైన పోషకాలు ఉంటాయి.

2 / 5
తమలపాకులను నేరుగా నమిలి తినవచ్చు. దీంతో మలబద్ధకం సమస్య దూరం చేసుకొచ్చు. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా చెబుతారు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో  పోరాడతాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టి... ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీరు తాగితే పేగు ఆరోగ్యానికి మంచిది.

3 / 5
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తమలపాకులో కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెన్స్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి.

4 / 5
శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది, ఉబ్బసం  లక్షణాలను ఉపశమనానికి , నయం చేయడానికి  ఉపయోగిస్తారు . తమలపాకుకు ఆవాల నూనె రాసి  ఛాతీపై ఉంచి కొద్దిసేపు అలాగే  ఉంచితే చాతీలో ఇబ్బంది తగ్గుతుంది.  తమలపాకు పేస్ట్‌ను చూర్ణం  రాస్తే  ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగుతుంది.

5 / 5
Follow us