Youtuber Harish Sai: రేప్ కేసుపై నోరు విప్పిన యూట్యూబర్ హర్షసాయి..
ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై.. రేప్ కేసు నమోదైంది. ఓ నటి హర్షసాయిపై చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులో కీలక విషయాలను ప్రస్తావించారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించారు.
రేప్ కేసుపై యూట్యూబర్ హర్షసాయి నోరు విప్పాడు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు.. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి అని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్ సమాధానం చెబుతారని వెల్లడించాడు. మరోవైపు పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. హర్షసాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. హర్షసాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతున్నారు.
కాగా బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు.. ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ సమయంలో వీడియోలు తీసి.. కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపింది.
యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరూ ఏదో సమయం హర్షసాయి వీడియోలు చూసే ఉంటారు. మొదట్లో యూట్యూబర్‌గా కెరియర్ బిగెన్ చేసిన హర్షసాయి..ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌గా మారాడు. వెరైటీ కాన్సెప్ట్‌లు, క్రియేటివ్ థాట్స్‌తో రీల్స్, వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్షసాయికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలో వెండితెరపై కూడా అడుగుపెట్టబోతున్నాడు..హర్షసాయి. మెగా పేరుతో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో లీడ్ రోల్‌లో హర్షసాయి నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను కూడా లాంచ్ చేశారు.
తాను సంపాదించిన సొమ్ములో.. కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందిన హర్షసాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను హర్షసాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలం విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెళ్లిపేరుతో హర్షసాయి మోసం చేశాడని ఓ సినీ నటి ఫిర్యాదు చేయడంతో..మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్షసాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..