TV9 Impact: ఇకపై డీజే పెడితే పోలీసుల మోతే.. డీజీపీ జితేందర్ ఏమన్నారో తెలుసా..

డీజే సౌండ్ పొల్యూషన్‌పై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు పాజిటివ్‌ స్పందన వచ్చింది. డీజేల విషయంలో గైడ్‌లైన్స్‌ విడుదల చేస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ విషయంలో త్వరలోనే కీలక ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు.

TV9 Impact: ఇకపై డీజే పెడితే పోలీసుల మోతే.. డీజీపీ జితేందర్ ఏమన్నారో తెలుసా..
Dj Sound
Follow us

|

Updated on: Sep 25, 2024 | 9:51 AM

శబ్ద కాలుష్యం.. డీజే మోతలపై.. ఇటీవల టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. డీజే చిల్లు పేరుతో ప్రసారమైన కథనాలకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందించింది. డీజేల విషయంలో గైడ్‌లైన్స్‌ విడుదల చేస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు. గణేష్‌ నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి చేశామన్న డీజీపీ.. శబ్ధ కాలుష్యం నగర వాసులను ఇబ్బంది పెట్టిందన్నారు. డీజే అంటే వీరసౌండు. ఆసౌండు సాలిడ్‌గా ఉంటేనే కుర్రకారుకు మజా. పబ్బుల్లో క్లబ్బుల్లో ఉండే ఈగబ్బు సంస్కృతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి చొచ్చుకువచ్చింది.

ఇటీవల గణేష్‌ నిమజ్జనం, మిలాద్ ఉన్-నబీ సమయంలో హైదరాబాద్ నగరాన్ని డీజేలు మోతలు హోరెత్తిపోయాయి. డీజేలు, డ్యాన్సులతో పాటు టపాసుల మోత, యువతీ యువకుల కేరింతలతో జంట నగరాలు దద్దరిల్లిపోయాయి. అంతేకాదు ఉత్సవాలు, విజయోత్సవ ర్యాలీల్లో డీజే సౌండ్స్‌ కామన్‌ అయిపోయాయి. దీంతో శబ్ద కాలుష్యం ఎక్కువవుతోందని సిటీ వాసుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సైతం డీజే బ్యాన్ చేయాలని సూచించారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో డీజే సౌండ్ సిస్టమ్ నుంచి మంటలు చెలరేగాయి.. చార్మినార్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంపై మాట్లాడిన ఆయన.. డీజే లు బ్యాన్ చేయాలన్నారు.

వీడియో చూడండి..

ధ్వని కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయనే ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ర్యాలీలలో డీజేలను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా ‘టీవీ9 డీజే చిల్లు’ కథనాలకు స్పందించిన డీజీపీ… త్వరలోనే డీజే సౌండ్‌పై మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..