బాబోయ్‌.. ముద్దొచ్చే పాండాలు ఇలా దాడి చేస్తాయా..? షాకింగ్‌ వీడియో చూస్తే వణుకే..

సాధారణంగా పాండాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఎవరిపై దాడి చేయవు. అలాంటిది చైనాలోని చాంగ్‌కింగ్ జూలో డింగ్ డింగ్ అనే తొమ్మిదేళ్ల పాండా కోపంతో తన జూ కీపర్‌పై దాడి చేసింది. జూ కీపర్ డోర్ క్లోజ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది.

బాబోయ్‌.. ముద్దొచ్చే పాండాలు ఇలా దాడి చేస్తాయా..? షాకింగ్‌ వీడియో చూస్తే వణుకే..
Panda Attack On Zoo Keeper
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 25, 2024 | 12:32 PM

చైనాలోని ఓ జూలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా జూ కీపర్‌పై పాండా హఠాత్తుగా దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పాండాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఎవరిపైనా దాడి చేయవు. అలాంటిది చైనాలోని చాంగ్‌కింగ్ జూలో డింగ్ డింగ్ అనే తొమ్మిదేళ్ల పాండా కోపంతో తన జూ కీపర్‌పై దాడి చేసింది. జూ కీపర్ డోర్ క్లోజ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఆ మహిళ కీపర్‌ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది.

ఈ దాడి చూసిన చాలా మంది సందర్శకులు భయంతో పరుగులు తీశారు. వారంతా షాక్‌తో కేకలు వేశారు. పాండా దాడితో కిందపడిపోయిన ఆమె..కాళ్లతో తన్నుతూ పాండాను దూరంగా తరిమి ప్రయత్నం చేసింది. కానీ, అది ఆమెపైకి ఎక్కింది.. దాని బరువు, పరిమాణాన్ని భరించిన ఆమెను చివరకు తప్పించుకోగలిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జూ అధికారులు ప్రస్తుతం భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షిస్తున్నారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

పాండాలు ముద్దు, ముద్దుగా కనిపిస్తాయి. వాటి పరిమాణం, బలం కారణంగా అవి ప్రమాదకరంగా కూడా ఉంటాయి. వయోజన పాండాలు 300 పౌండ్ల వరకు బరువు కలిగి ఉంటాయి. శక్తివంతమైన దవడలు, పదునైన దంతాలను కలిగి ఉంటాయి. సాధారణంగా పాండాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఎవరిపైనా దాడి చేయవు. ఈ ఘటన అనంతరం జూ నిర్వాహకులు భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టనున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..