AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌..! భారతీయ రాజుల ఆభరణాల విలువ తెలిస్తే.. వామ్మో అనాల్సిందే..!

రాజులు, మహారాజులు, రాణులు ఎప్పుడూ భారీ, అతి ఖరీదైన ఆభరణాలను ధరించేవారు. ఆస్తులు, ఆభరణాలు, సంస్థానాల కోసమే తరచూ యుద్ధాలు చేసేవారు. చరిత్రలో భారతీయ రాజుల అత్యంత ఖరీదైన నగలు ఏవో తెలుసా..? ఆరు మంది రాజులు తయారు చేసిన ఖరీదైన ఆభరణాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చరిత్రలో నిలిచిపోయిన అలాంటి ఖరీదైన ఆభరణాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..వాటిలో ఒకటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్. ఆ వివరాల్లోకి వెళితే..

Jyothi Gadda
|

Updated on: Sep 25, 2024 | 1:11 PM

Share
Emerald Necklace: పచ్చ హారము నవనగర్ మహారాజు కోసం తయారు చేసిన పచ్చ హారము దాని రూపకల్పనకు చాలా ప్రసిద్ధి చెందింది. ఆర్ట్ డెకో శైలిలో జాక్వెస్ కార్టియర్ రూపొందించిన ఈ నెక్లెస్ మొత్తం 277 క్యారెట్ల బరువున్న 17 దీర్ఘచతురస్రాకార కొలంబియన్ పచ్చలతో తయారు చేయబడింది. మధ్యలో 70 క్యారెట్ల బరువున్న పచ్చ టర్కీయే మాజీ సుల్తాన్‌కు చెందినదని చెబుతారు.

1 / 6
Indore Pear Necklace: ఇండోర్ పియర్ నెక్లెస్‌ను ఇండోర్‌కు చెందిన రాజా యశ్వంత్ రావ్ హోల్కర్ II తన భార్య మహారాణి సంయోగితా దేవి కోసం తయారు చేశారు. ఈ నెక్లెస్‌లో బేరి లాంటి వజ్రాలు ఉన్నాయి.

2 / 6
Noor Jahan, Taj Mahal Necklace: ఈ నెక్లెస్ ప్రేమ, అద్భతమైన కళా నైపుణ్యతకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ నెక్లెస్ కార్టియర్ చేత తయారు చేయబడింది. ఇది అందమైన బంగారం, కెంపులతో కూడిన తుషార వజ్రాల కలయిక. నిజానికి దీనిని జహంగీర్ తన భార్యపై ప్రేమతో తయారు చేయించాడని చెబుతారు.

3 / 6
Patiala Necklace: పాటియాలా నెక్లెస్ మహారాజా భూపీందర్ సింగ్ పాటియాలా హార్‌ను తయారు చేయించాడు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్ ఇదే. ఈ నెక్లెస్‌లో 2930 వజ్రాలు పొదగబడ్డాయి. మధ్యలో 234 క్యారెట్ల పసుపు వజ్రం పొదిగి ఉంటుంది. ఈ నెక్లెస్ ధర 112 కోట్లకు పైగా ఉంది.

4 / 6
Patiala Ruby Choker: పాటియాలా రూబీ చోకర్ 1931లో పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ కోసం కార్టియర్ ఆఫ్ ప్యారిస్ రూపొందించారు. ఇందులో రూబీ, ముత్యాలు, వజ్రాలతో తయారు చేసిన ఈ చోకర్ ప్రజాదరణ పొందింది. దీనిని పాటియాలా రూబీ చోకర్ అని పిలుస్తారు. ఈ నెక్లెస్ ధర ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ హారాన్ని బక్తావర్ కౌర్ సాహిబాకు బహుమతిగా ఇచ్చారు.

5 / 6
'star Of The South' Diamond: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో 'స్టార్ ఆఫ్ సౌత్' ఒకటి. ఇది 1853లో బ్రెజిల్‌లో గుర్తించారు. ఇది బరోడా రాణి వద్ద ఉండేది.. మహారాజా ఖండేరావ్ గైక్వాడ్ ఈ వజ్రం నుండి ఒక హారాన్ని తయారు చేసాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ నెక్లెస్ మూడు హారాల కలయికగా తయారు చేశారు.

6 / 6