Corona in TS Schools: తెలంగాణ పాఠశాలల్లో కోవిడ్ విజృంభన … ఉపాధ్యాయులను వణికిస్తున్న కరోనా..
Corona in TS Schools: తెలంగాణలోని పలు పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. వివిధ జిల్లాల్లోని స్కూల్స్ లో ఉపాధ్యాయులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్ వ్యాప్తితో..
Corona in TS Schools: తెలంగాణలోని పలు పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. వివిధ జిల్లాల్లోని స్కూల్స్ లో ఉపాధ్యాయులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్ వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎలాంటి భయమూ వద్దని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ.. కరోనా వ్యాప్తి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉపాధ్యాయులను కోవిడ్ వణికిస్తోంది. ఏటూరునాగారం మండల కేంద్రం ప్రభుత్వ హైస్కూల్ లో ముగ్గురు ఉపాధ్యాయులకు , మహముత్తారంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి స్కూళ్లను శానిటైజ్ చేయిస్తున్నారు. జిల్లా అధికారులు విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వైరస్ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు. టీచర్స్ కు కరోనా నిర్ధారణ కావడంతో.. సహా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వైరస్ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు.
Also Read: అన్నంత పనీ చేసిన మోనిత! షాక్ లో కార్తీక్..దీప..!