Telangana: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Telangana: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
Road Accident

Road Accident: తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద జరిగిన ఈ రోడ్డు (Mulugu District) ప్రమాదంలో

Shaik Madarsaheb

|

Mar 05, 2022 | 11:29 AM

Road Accident: తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద జరిగిన ఈ రోడ్డు (Mulugu District) ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి అటుగా వెళ్తున్న ఆటోను.. వేగంగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్‌‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వ్యాను అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరికొంతసేపట్లో గ్రామానికి చేరుతారనగా.. ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను డీసీఎమ్ వాహనం అతి వేగంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతులు మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలోని కేసీఆర్ కాలనీకి చెందిన కిరణ్, అజయ్, కౌసల్య, ఆటో డ్రైవర్ జానీ గా గుర్తించారు. వీరికి కోమటిపల్లి లో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళులు మంజూరు చేసింది.. ఈ క్రమంలో వీరంతా అన్నారం షరీఫ్ దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Also Read:

ఆర్టీసీ బస్సులో కీచక పర్వం.. ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిని.. డ్రైవర్ ఏం చేశాడంటే

ఫేస్ బుక్ తో పరిచయమై.. డబ్బులున్నాయని నమ్మించి, ఆపై నట్టేట ముంచి.. సీన్ కట్ చేస్తే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu