AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు (Telangana Police). డ్రగ్స్‌ను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా అక్కడక్కడ..

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
Subhash Goud
|

Updated on: Mar 05, 2022 | 7:06 AM

Share

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు (Telangana Police). డ్రగ్స్‌ను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి డ్రగ్స్‌ (Drugs) మూఠాలు. ఇందు కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టి డ్రగ్స్‌ భూతాన్ని అంతం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు పోలీసులు. ఇందు కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తోంది డ్రగ్స్. అటు డ్రగ్స్‌ను రూపుమాపేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. యువత, విద్యార్థులు చెడు స్నేహాలతో సరదాగా ప్రారంభించిన మాదకద్రవ్యాల వినియోగం, వారి భవిష్యత్‌ను నాశనం చేస్తుంది. విద్యార్థులను మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులను చేస్తున్న సంఘ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటోంది పోలీసు వ్యవస్థ. అటు ర్యాగింగ్‌ భూతం జడలు విప్పి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోంది.

ఈ రెండు ఇష్యూలపై సీరియస్‌గా ఉంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా వీటిపై అవగాహన ర్యాలీ నిర్వహించింది పోలీస్‌ శాఖ. కాలేజీలలో ర్యాగింగ్ భూతాన్ని తరిమేద్దాం అని సూచించారు కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్. కూకట్‌పల్లి JNTU ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన యాంటీ డ్రగ్, యాంటీ ర్యాగింగ్ ర్యాలీని ప్రారంభించారు ఏసీపీ. డ్రగ్స్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని, డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు చంద్రశేఖర్. ర్యాగింగ్ అమానవీయ చర్య అని, విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడి కేసుల్లో చిక్కుకొని భవిష్యత్ నాశనం అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు ఏసీపీ చంద్రశేఖర్. అందుకే విద్యార్థులు డ్రగ్స్‌కు, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

Fishes: నీటిలో ఉండే చేపలు ఎప్పుడు నిద్రపోతాయి..? ఈత కొట్టడం ద్వారా అలసిపోతాయా..?

Moon Surface: చంద్రుడికి ముప్పు.. ఉపరితలాన్ని ఢీకొట్టనున్న 3 టన్నుల వ్యర్థాలు..!