AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై స్పందించిన మాజీ మంత్రి.. గవర్నర్‎పై గరంగరం..

తెలంగాణ ఎమ్మెల్సీ కోటాలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో దిగారు. అయితే వీరి ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ఈ ఎన్నిక తీరును తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ గవర్నర్‎పై ఫైర్ అయ్యారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై స్పందించిన మాజీ మంత్రి.. గవర్నర్‎పై గరంగరం..
Harish Rao
P Shivteja
| Edited By: |

Updated on: Jan 26, 2024 | 1:48 PM

Share

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ ఎమ్మెల్సీ కోటాలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో దిగారు. అయితే వీరి ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ఈ ఎన్నిక తీరును తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ గవర్నర్‎పై ఫైర్ అయ్యారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని అరోపించారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారు అని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని ఎద్దేవా చేశారు.

ఇది ద్వంద నీతి కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఇక్కడ గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం కాదా అని విమర్శించారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసిందన్నారు. అయితే అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని తెలిపారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని తెలిపారు. కానీ బీఆర్ఎస్‎కు, కాంగ్రెస్‎కు తేడా చూపిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని తీవ్రంగా ఖండించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?