విశాఖలో విదేశీ పారా గ్లైడర్ పై దాడి.. అదుపులో నిందితులు.. అసలు కారణం ఇదే..!

అతనో విదేశీయుడు.. పారా గ్లైడింగ్ అంటే అతనికి ఆసక్తి. ఇండియాకి వచ్చిన ఈ ఫార్నర్.. వేర్వేరు చోట్ల పారా గ్లైడింగ్ చేశాడు. చివరకు విశాఖలో అనువైన ప్రదేశాలను వెతుకుతున్నాడు. ఇంతలో ముగ్గురు యువకులు.. వచ్చి ఏదో మాట్లాడారు. వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా దాడి చేశారు. తేరుకునేలోపే మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయారు.

విశాఖలో విదేశీ పారా గ్లైడర్ పై దాడి.. అదుపులో నిందితులు.. అసలు కారణం ఇదే..!
Vizag Beach
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Srikar T

Updated on: Jan 26, 2024 | 11:27 AM

విశాఖపట్నం, జనవరి 26: అతనో విదేశీయుడు.. పారా గ్లైడింగ్ అంటే అతనికి ఆసక్తి. ఇండియాకి వచ్చిన ఈ ఫార్నర్.. వేర్వేరు చోట్ల పారా గ్లైడింగ్ చేశాడు. చివరకు విశాఖలో అనువైన ప్రదేశాలను వెతుకుతున్నాడు. ఇంతలో ముగ్గురు యువకులు.. వచ్చి ఏదో మాట్లాడారు. వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా దాడి చేశారు. తేరుకునేలోపే మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. స్విట్జర్లాండ్‎కు చెందిన 23 ఏళ్ల కీనర్ నోహ్ ఎలియాస్ అనే యువకుడికి పారా గ్లైడింగ్ అంటే ఆసక్తి. టూరిస్ట్‌ వీసాపై ఇండియాకు వచ్చారు. వివిధ దేశాలు తిరుగుతూ అనువైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్, పారా గ్లైడింగ్ చేస్తూ ఉంటారు. రెండు రోజుల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌ పర్యటన ముగించుకుని బుధవారం తెల్లవారు జామున విశాఖ చేరుకున్నారు. నేరుగా యారాడ బీచ్‌ తీరంలో కొండలపై కూర్చుని బీచ్‌ అందాలు ఆస్వాదిస్తున్నాడు.

అయితే.. విశాఖ చేరుకున్న ఎలియాస్.. యారాడ తీర ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ గూగుల్ లొకేషన్ ఆధారంగా.. బీచ్ తీరాన ఉన్న కొండ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో.. ముగ్గురు గుర్తుతెలియని యువకులు అక్కడకు వచ్చారు. ఏదో మాట్లాడారు. వారి ఉద్దేశంలో డబ్బులు అడుగుతున్నట్టు యువకుడు గుర్తించారు. లేవని చెప్పేసరికి.. ఒక్కసారిగా దాడి చేశారు. దోచుకోవడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోయేసరికి.. చివరకు మొబైల్ లాక్కున్నారు. ఆ ముగ్గురిని ఏలియాస్ ప్రతిఘటించడంతో.. దాడి చేయడమే కాకుండా.. ఎడమచేతి భుజంపై కొరికేశారు. మొబైల్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఆ విదేశీ యువకుడి ఫిర్యాదుతో.. రంగంలోకి దిగారు పోలీసులు. న్యూ పోర్ట్ సిఐ ఎర్రం నాయుడు, ఏసీపీ పాల్ ఘటన స్థలికి వెళ్లి కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలించగా దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మల్కాపురం సమీప జై ఆంధ్రకాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ప్రత్యేక బృందంతో నిందితుల కోసం గాలించారు.. వారిలో ఒకర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విదేశీయుడిపై దాడి ఘటన విశాఖలో కలకలంరేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..