Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొల్లాపూర్ ఎమ్మెల్యే‌కు మాజీ మంత్రి జూపల్లి ఓపెన్ ఛాలెంజ్.. తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు..

పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాలపై టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌ ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో స్వయంగా మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Telangana: కొల్లాపూర్ ఎమ్మెల్యే‌కు మాజీ మంత్రి జూపల్లి ఓపెన్ ఛాలెంజ్.. తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు..
Mla Beeram Harshavardhan Reddy Vs Jupally Krishna Rao
Follow us
Venkata Chari

|

Updated on: Jun 19, 2022 | 12:54 PM

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓపెన్ ప్రెస్ మీట్‌కు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే హర్ష వర్ధన్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనపై ఎలాంటి ఆరోపణలు, ప్రశ్నలు ఉన్నా ఈ నెల 26న కొల్లాపూర్ సెంటర్‌లో తేల్చు్కుందామంటూ జూపల్లి సవాల్ విసిరారు. ఓపెన్ ప్రెస్ మీట్ కోసం తానే స్వయంగా పోలీసుల అనుమతి తీసుకుంటానని ఆయన అన్నారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకు, స్వయంగా కేటీఆర్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఇవి మరింత హీటెక్కాయి.

కాగా, పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాలపై టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌ ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో స్వయంగా మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కొల్హాపూర్ గులాబీ గూటిలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి, కార్ ఎక్కడంతో కొల్హాపూర్ టీఆర్ఎస్‌లో అగ్గి రాజుకుంది. తాజా, మాజీ నేతల మధ్య ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఐక్యత కుదరడం లేదు.

ఇవి కూడా చదవండి

అటు, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో ఐక్యత లేదనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఈ ఇష్యూపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కొల్లాపూర్‌లోని జూపల్లి నివాసానికి వెళ్లారు. కొల్లాపూర్‌లో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో, జూపల్లిని కేటీఆర్ కలవడం జిల్లా రాజకీయాలను హీటెక్కించింది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గ్రూపు రాజకీయాలపై జూపల్లితో మంత్రి కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలాసార్లు మాజీమంత్రి జూపల్లి, తమ సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. గతంలో కేసీఆర్‌ టూర్‌కు, ప్రస్తుత కేటీఆర్ సభకు కూడా జూపల్లి కృష్ణారావు దూరంగా ఉన్నారు.