Harish Rao: 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో మాజీ మంత్రి మాటామంతి..
సిద్దిపేట నియోజకవర్గ 10 వ తరగతి విద్యార్థుల తల్లితండ్రులతో, విద్యాధికారులతో, ఉపాధ్యాయులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల మర్చి 18 నుండి 10వ తరగతి పరీక్షలు సమీపస్తున్నాయని, గత 6 ఏళ్లుగా నేను మీకు ఉత్తరం వ్రాస్తున్న.. రాష్ట్రంలో మన సిద్దిపేట అగ్రభాగాన నిలుస్తుందని చెప్పారు.

సిద్దిపేట నియోజకవర్గ 10 వ తరగతి విద్యార్థుల తల్లితండ్రులతో, విద్యాధికారులతో, ఉపాధ్యాయులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల మర్చి 18 నుండి 10వ తరగతి పరీక్షలు సమీపస్తున్నాయని, గత 6 ఏళ్లుగా నేను మీకు ఉత్తరం వ్రాస్తున్న.. రాష్ట్రంలో మన సిద్దిపేట అగ్రభాగాన నిలుస్తుందని చెప్పారు. ఇందుకు ఉపాధ్యాయుల కృషి అభినందనియమనిమన్నారు. ఈ రోజులు మీ పిల్లలను చదివించి మంచి మార్కులు వచ్చేల చూడాలన్నారు. మీరే మీ పిల్లలను చదివించాలి.. ఈ కొన్ని రోజులు టీవీలు బంద్ చేయాలి. ఫంక్షన్లకు దూరం ఉంచాలి. పొద్దున్న 4 గంటలకు నిద్ర లేపి చదివించాలని మీ అందరికి ఉత్తరం వ్రాసినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక తరగుతులు ఏర్పాటు చేసాం. నా స్వంత డబ్బులతో సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేసాను. ఇంట్లోనే అర్థం కాని సబ్జెక్ట్‌ను వినేలా డిజిటల్ కంటెంట్ బుక్స్ కూడా పంపించాను. మీ పిల్లలు నా బిడ్డల్లా భావించి ఇలా నా ప్రయత్నం చేశానన్నారు. పిల్లలు మంచిగా చదువుకుని మంచి మార్కులు రావాలన్నదే నా తాపత్రయమని చెప్పారు.
మీ బిడ్డలకు మంచి మార్కులు వచ్చి మీ కలలు, ఆశయం నెరవేరాలి అని నా తపన అంటూ తల్లితండ్రులతో మాట్లాడారు సిద్దిపేటకు మంచి పేరు తేవాలని నా ఆకాంక్షఅని తెలియజేసారు. మీ పిల్లలో ఆత్మవిశ్వాసం నింపాలి. మనో దైర్యం కలిగించాలని హరీష్ రావు సూచించారు. మీ పిల్లలను రెగ్యులర్ స్కూల్‌కు వచ్చేట్టు శ్రద్ద పెట్టాలన్నారు. కొంతమంది స్కూల్‌కు సరిగా రాక పోవడం ప్రత్యేక తరగతుల్లో ఉండకపోవడం వలన చదువులో వెనకపడి పోతున్నారని తెలిపారు. ఈ నెల రోజులు స్కూల్‌కు పంపించాలి, ప్రత్యేక తరగతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తల్లితండ్రులకు దిశానిర్థేశం చేశారు. కొన్ని సబ్జెక్ట్‌లో వీక్ గా ఉండటం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అలాంటి వారికీ ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పారు. 10వ తరగతి భవిష్యత్‌కు పునాది.. ఇందులో మనం ఒక మెట్టు ఎక్కితేనే భవిష్యత్‌లో పై చదువులకు..ఉద్యోగలకు అవకాశం ఉంటుందని కీలక సూచనలు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొంతమంది విద్యార్థుల తల్లి తండ్రులతో కన్ఫరెన్స్ లో మాట్లాడారు.. తమ విద్యార్థులను ఉదయాన్నే నిద్ర లేపి చదివిస్తున్నామని సమాధానం ఇచ్చారు. మీరు పంపిన ఉత్తరం వచ్చిందని తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




