AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో దోషులను శిక్షించాల్సిందే.. కేటీఆర్ ట్వీట్!

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్ పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

KTR: తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో దోషులను శిక్షించాల్సిందే.. కేటీఆర్ ట్వీట్!
KTR
Balu Jajala
|

Updated on: Feb 22, 2024 | 2:02 PM

Share

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్ పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంపై స్పందించి, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు

అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కేటీఆర్ అన్నారు. గత సంవత్సరం జనవరిలో సియాటెల్ నగరంలో కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తన కారు ఢీకొనడంతో జాహ్నవి మరణించింది. అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారి జరిగిన ప్రమాదం గురించి బాధపడకుండా, వర్ణ వివక్షతో మాట్లాడుతున్న వీడియో బయటకి వచ్చింది. దీంతో ఆ పోలీస్ అధికారి కావాలనే గుద్ధి చంపారని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఉన్నత విద్యకోసం ఎంతోమంది తెలుగు విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు. తమ కలలను నెరవేర్చుకునేందుకు యూఎస్, రష్యా, కెనడా లాంటి దేశాలకు వెళ్తున్నారు. ప్రతి యేటా విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నా.. విద్యార్థులకు రక్షణ లేకుండాపోయింది. ఎన్నో ఏళ్లుగా ఆ దేశంలోపని చేస్తున్నా రక్షణ చర్యలకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో భారత విద్యార్తుల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్