AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR Tour: నిషేధం తర్వాత జనంలోకి కేసీఆర్… పద్దతిగా మారేనా? మరింతగా డోసు పెంచుతారా ?

48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. అయితే ఇకపై పద్దతిగా మాట్లాడతారా? లేక మరింతగా మాటల డోసు పెంచుతారా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసీఆర్‌ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్‌ విధించడం బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర అంటున్నారు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు

KCR Tour: నిషేధం తర్వాత జనంలోకి కేసీఆర్... పద్దతిగా మారేనా? మరింతగా డోసు పెంచుతారా ?
Kcr
Balaraju Goud
|

Updated on: May 03, 2024 | 10:51 AM

Share

48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. అయితే ఇకపై పద్దతిగా మాట్లాడతారా? లేక మరింతగా మాటల డోసు పెంచుతారా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసీఆర్‌ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్‌ విధించడం బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర అంటున్నారు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సుయాత్ర ఇవాళ శుక్రవారం మే 3న తిరిగి మొదలవుతుంది. 48 గంటల నిషేధం తర్వాత మళ్లీ ప్రచారం కొనసాగిస్తారు కేసీఆర్‌. రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దీంతో కేసీఆర్‌ ఏం మాట్లాడతారని రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 48 గంటల బ్యాన్‌ విధించడంతో ఇకపై పద్దతిగా మాట్లాడతారా ? లేక డోసు పెంచుతారా ? అనేది సస్పెన్స్‌గా మారింది.

అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసీఆర్‌కు ఈసీ బ్రేక్‌ వేసింది. కేసీఆర్‌కు బిగ్ షాక్‌ ఇస్తూ… ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. రెండు రోజుల బ్యాన్‌ విధించింది ఎలక్షన్‌ కమిషన్‌. దీన్నంతటికీ బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర అంటున్నారు కేటీఆర్‌. ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌కి ఈసీకి వినిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఇచ్చినా ఈసీ స్పందించడం లేదన్నారు కేటీఆర్‌.

మహబూబాబాద్‌లో బస్సుయాత్ర ముగిశాక 48 గంటల నిషేధం విధించారు. దీంతో షెడ్యూల్‌ ప్రకారం మే2వ తేదీన జమ్మికుంటలో జరిగే రోడ్‌షో రద్దయిపోయింది. ఇక ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్‌షో నిర్వహిస్తారు కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ని గెలిపించాలని ప్రచారం చేస్తారు కేసీఆర్‌. అయితే 48 గంటల నిషేధం తర్వాత జరిగే ప్రచార సభలో కేసీఆర్‌ ఎవరిని టార్గెట్‌ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శల డోసు పెంచుతారా ? లేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్‌పై, సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆరోపణలు గుప్పిస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇవాళ రాత్రి రామగుండంలో జరిగే కేసీఆర్‌ రోడ్‌షోపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు లేకుంటే తెలంగాణ ప్రజల వాయిస్‌ వినిపించే అవకాశం ఉండదని ఇప్పటికే అనేక సమావేశాల్లో కామెంట్‌ చేశారు కేసీఆర్‌. దీంతో 48 గంటల నిషేధం తర్వాత ప్రచారం కొనసాగించనున్న కేసీఆర్‌, ఉద్యమం సమయం నాటి కేసీఆర్‌ను గుర్తు చేస్తారా ? లేక కాస్త తగ్గి నిబంధనలకు అనుగుణంగా పద్దతిగా మాట్లాడతారా ? అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు రేపు మంచిర్యాల, ఎల్లుండి జగిత్యాలలో జరిగే రోడ్‌షోలలో కేసీఆర్‌ పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…