ప్రేమ కోసం పరితపిస్తున్న పులులు..! ఒకటి తూర్పు.. మరొకటి పశ్చిమాన.. రెండూ కలిసేదేలా?
జగిత్యాల జిల్లాలో ఒక లేగ దూడను చంపి తినేసింది పెద్ద పులి. దీంతో ఈ పులి సంచారం పసిగట్టిన గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాద ముద్రికలు చూసి పెద్దపులిగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. అయితే ఇది మగ పులిగా గుర్తించారు అటవీ శాఖ సిబ్బంది. ఇప్పటికీ.. ఈ పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుంది. అదే విధంగా మంథని అటవీ ప్రాంతంలో మరో పెద్ద పులి తిరుగుతున్నట్లు రైతులు చూశారు. ఇది ఆడ పులిగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రేమ కోసం.. రెండు పెద్ద పులులు పరితపించిపోతున్నాయి. నెల రోజుల నుంచీ ఈ రెండు పులులు కలుసుకోవడం లేదు. మహారాష్ట్ర నుంచి రెండు పులులు తప్పిపోయి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అటవీ ప్రాంతానికి వచ్చాయి.. ఒక్కటి ఆడ పులి కాగా.. మరొక్కటి మగ పులి. ఈ సమయంలో తోడు కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే ఒకదాన్ని మరొకటి వెతుక్కుంటూ వచ్చి, తప్పిపోయాయి. అయితే ఈ రెండు పులులు ఇంకా కలుసుకోలేదు. ఇంకా.. నడకను కొనసాగిస్తున్నాయి. పులి సంచరిస్తున్న ప్రాంతంలో మాత్రం స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పులి మాత్రం.. ఇంకో పులి కోసం… ప్రయాణం కొనసాగిస్తున్నాయి ఈ రెండు పులులు. ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయి.. కలుసుకునే అవకాశం ఉందా..? ఇప్పుడు తెలుసుకుందాం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో రెండు డివిజన్లు ఉన్నాయి. తూర్పు డివిజన్.. పశ్చిమ డివిజన్.. తూర్పు డివిజన్ మంథని అటవీ ప్రాంతం ఉంటుంది. పశ్చిమ డివిజన్‌లో సిరిసిల్ల, జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతాలు ఉంటాయి. ఈ రెండు అటవీ ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం ఎప్పుడు లేదు. అప్పుడప్పుడు చిరుత పులులు కనబడుతుంటాయి. కానీ.. నెల రోజుల నుంచి ఈ రెండు డివిజన్‌లలో పెద్ద పులుల సంచారం మొదలైంది. అంతేకాకుండా సిసి టీవీలో వాటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
ఇటీవల జగిత్యాల జిల్లాలో ఒక లేగ దూడను చంపి తినేసింది పెద్ద పులి. దీంతో ఈ పులి సంచారం పసిగట్టిన గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాద ముద్రికలు చూసి పెద్దపులిగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. అయితే ఇది మగ పులిగా గుర్తించారు అటవీ శాఖ సిబ్బంది. ఇప్పటికీ.. ఈ పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుంది. అదే విధంగా మంథని అటవీ ప్రాంతంలో మరో పెద్ద పులి తిరుగుతున్నట్లు రైతులు చూశారు. ఇది ఆడ పులిగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే సహజంగా మగ పులి, ఆడ పులి జాడ కోసం తిరుగుతుంది. ఇప్పుడు కూడా మగ పులి – ఆడ పులి కోసం తిరుగుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఆడ పులి కూడా.. మగ పులి కోసం తిరుగుతుంది. మొత్తానికి.. ఈ రెండు పులులు ప్రేమ కోసం ప్రతి రోజు 50 కిలో మీటర్లకు వరకు నడుస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. కానీ రెండు అటవీ ప్రాంతాలు దూరం.. దూరంగా ఉన్నాయి.. అంతేకాకుండా ఈ సీజన్‌లో పులుల సంతానోత్పత్తి సమయం. దీని కారణంగా ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రెండు పులులు కలుసుకుంటాయి. ఏప్రిల్ వరకు సమయం ఉంది. దీంతో ఈ రెండు పులులు.. ప్రతి రోజూ.. ఏదో ప్రాంతంలో కనబడుతున్నాయి. చూసిసవారు భయంతో పరుగులు తీస్తున్నారు. తాజాగా ఈ రెండు పులులు మహారాష్ట్ర అట ప్రాంతం నుంచి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమవుతున్నారు.
పులులు ఒంటరిగా ఉండేందుకు మొగ్గు చూపుతాయి. గుంపులు. గుంపులుగా ఉండవు. వేట కోసం ఎంత దూరమైన వెళ్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆడ, మగ పులి కలుసుకోవడానికి సుదూర ప్రయాణం చేస్తాయి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం 30 యేళ్ల తరువాత కరీంనగర్ డివిజన్‌లో మొదటి సారి పెద్దపులిని చూశామని అంటున్నారు.. ప్రేమైనా కావచ్చు.. ఇతర కారణాలతో కూడా పులులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పులి కదలికలను మాత్రం పసిగడుతున్నామని అంటున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అంటున్నారు. మొత్తానికి ఈ ప్రేమ పులులు కలుసుకోవాలని కోరుకుంటున్నారు. ప్రజలు భయంతో బయటపడుతారు. ఒకవేళ మహారాష్ట్రకు వెళ్లిపోయాన్న వార్త నిజమైతే ఊపిరి పిల్చుకుంటారు. ఇక ప్రతి రోజు అటవీ ప్రాంత సమీప ప్రజలు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఏ ప్రేమ పులులు ఎప్పుడు కలుసుకుంటాయో.. వేచి చూడాలి..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..