AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: రోడ్డు పక్కన చల్లటి జ్యూస్ తాగుతున్నారా.. అమ్మబాబోయ్.! ఈ విషయం తెలిస్తే జన్మలో ముట్టరు

ప్రమాదకర రసాయనాలు, కుళ్లిపోయిన ఫ్రూట్స్‌తో జ్యూస్‌‌‌లు తయారు చేసి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జ్యూస్ సెంటర్స్ నిర్వాహకులపై వరంగల్‌‌‌లో టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. పేరు మోసిన జ్యూస్ సెంటర్‌పై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 19 రకాల కల్తీ జ్యూస్ ప్రొడక్ట్స్, రసాయనాలు సీజ్ చేశారు.

Warangal: రోడ్డు పక్కన చల్లటి జ్యూస్ తాగుతున్నారా.. అమ్మబాబోయ్.! ఈ విషయం తెలిస్తే జన్మలో ముట్టరు
Juice Centers
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 11, 2025 | 9:18 AM

Share

వేసవి వచ్చిందంటే చాలు శీతల పానీయాలు, జ్యూస్‌లతో సేద తీరడం కోసం తపిస్తుంటాం. జ్యూస్ టేస్ట్‌గా ఉంటే చాలు లొట్టలేసుకుంటూ తాగేస్తాం. కానీ జ్యూస్ తయారీలో కనీస నిబంధనలు పాటించని వ్యాపారులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హనుమకొండలోని బాలసముద్రం ప్రాంతంలో పేరు మోసిన బరిస్టా జ్యూస్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నివ్వెరపోయారు. జ్యూస్‌ల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కుళ్లిన ఫ్రూట్స్ చూసి అవాక్కయ్యారు. కుళ్లిపోయిన పండ్లు, కాలం చెల్లిన ఆహార పదార్థాలతో జ్యూస్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ‘Barista Juice House’ నిర్వాహకులు కనీస ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, కుళ్లిపోయిన, పాడైపోయిన పండ్లను వాడుతూ, కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ జ్యూస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

కల్తీ ప్రొడక్ట్స్‌లో దాదాపు 19 రకాల జ్యూస్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. వాటిని పరీక్షలు కోసం హైదారాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్స్ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కల్తీ ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్ కృష్ణారావు, రాజేందర్‌పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జ్యూస్ వ్యాపారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా.. వ్యాపారులపై చర్యలు తప్పవు. ప్రముఖ బ్రాండ్‌లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచాం. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు పాటించని ఫుడ్ సేఫ్టీ శాఖ సహాయంతో వ్యాపారులపై చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మన పూర్వికులు అంత బలమైన పనులు చేసేవారంటే రీజన్ ఇదే..
మన పూర్వికులు అంత బలమైన పనులు చేసేవారంటే రీజన్ ఇదే..
18 ఏళ్లకే 3 సినిమాలతో స్టార్ డమ్.. ఇండస్ట్రీని కుదిపేసిన హీరోయిన్
18 ఏళ్లకే 3 సినిమాలతో స్టార్ డమ్.. ఇండస్ట్రీని కుదిపేసిన హీరోయిన్
కేంద్ర ప్రభుత్వ అద్బుత పథకం.. ప్రతీ నెలా రూ.20 వేల ఆదాయం
కేంద్ర ప్రభుత్వ అద్బుత పథకం.. ప్రతీ నెలా రూ.20 వేల ఆదాయం
నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ..
నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ..
సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు నమోదు
సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు నమోదు
హైదరాబాద్‌లో రియల్ భూమ్.. ఆ ప్రాంతంలో రూ.80వేలు పిలికిన గజం భూమి
హైదరాబాద్‌లో రియల్ భూమ్.. ఆ ప్రాంతంలో రూ.80వేలు పిలికిన గజం భూమి
ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష
ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష
'చేతబడులు.. క్షుద్ర పూజలు..' సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాల్సిందే
'చేతబడులు.. క్షుద్ర పూజలు..' సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాల్సిందే
సారూ.. యాదికుందా? ఎద్దుపై తహసీల్దార్ ఆఫీస్‌కు రైతు.. Video వైరల్
సారూ.. యాదికుందా? ఎద్దుపై తహసీల్దార్ ఆఫీస్‌కు రైతు.. Video వైరల్
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచితంగా టిఫిన్..
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచితంగా టిఫిన్..