Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందుతున్న వీరులు వీరే అంటూ ఫ్లెక్సీల కలకలం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో గాంధీభవన్ వద్ద ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, గెలుపొందుతున్న వీరులు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముందుగా తెలంగాణలో పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే అంటూ హెడ్డిం పెట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో గాంధీభవన్ వద్ద ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, గెలుపొందుతున్న వీరులు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముందుగా తెలంగాణలో పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే అంటూ హెడ్డిం పెట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఓటర్లకు వందనాలు, అభివందనాలు చెబుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని ప్రచురించారు. ఓటర్లలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఇందులో పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీని వేరంగుల రమేష్ బాబు అనే వ్యక్తి ఏర్పాటు చేసినట్లు అతని పేరుతో పాటూ మరో ఇద్దరి పేర్లు ముద్రించారు. అలాగే నియోజకవర్గాల వారీగా గెలుపొందుతున్న అభ్యర్థుల జాబితాను ఇందులో పొందుపరచడం సంచలనంగా మారింది. కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమైన తరుణంలో ఇలాంటివి వెలుగులోకి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఫ్లెక్సీలో పొందుపరిచిన గెలుపొందే అభ్యర్థుల పేర్లు..
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, మధుయాష్కీ, మైనంపల్లి హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్, కొండా సురేఖ, జగ్గారెడ్డితో పాటూ పలువురి ముఖ్యనేతల పేర్లను ముద్రించారు. దీనిపై ఈసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..